Saturday 26th July 2025
12:07:03 PM
Home > సినిమా > Ustad Bhagath Singh: పవన్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్!

Ustad Bhagath Singh: పవన్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్!

Ustad Bhagath singh first look

Ustad Bhagath Singh Firstlook | పవన్ కళ్యాణ్ సినిమాకు సంబంధించిన ప్రతి అప్ డేట్ ఆయన అభిమానులకు సినిమా రిలీజ్ అయినంత సంబరం.

టైటిల్ అనౌన్స్ మెంట్ దగ్గరి నుంచి ఫస్ట్ లుక్ వరకు బయటకి రావడమే ఆలస్యం ఇంటర్నెట్ ను షేక్ చేసేస్తాయి. ఆఖరికి షూటింగ్ సెట్స్ లో చిన్న ఫొటో బయటకి వచ్చినా అది సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయిపోతుంది.

తాజాగా పవన్ కళ్యాణ్ ఫొటో ఒకటి అలాగే చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ అనే  సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఈ సినిమా నుండి పవన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు సినిమా నిర్మాతలు. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో  తెగ వైరల్ అవుతోంది.

అభిమానులకు పూనకం తెచ్చేలా ఉన్న పవన్ పవర్ ఫుల్ లుక్ కు ఫ్యాన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. గతంలో గబ్బర్ సింగ్ తో పవన్ కళ్యాణ్ ని ఓ రేంజ్ లో చూపించిన హరీశ్ శంకర్ కు ఈసారి కూడా ఇరగదీస్తాడని పీకే ఫ్యాన్స్ చాలా అంచనాలు పెట్టుకున్నారు.

ఆ అంచనాలను అందుకునే రేంజ్ లోనే ఉంది ఈ లుక్. ఫస్ట్ లుక్ నెక్స్ట్ లెవల్ అంటూ డైరెక్టర్ హరీష్ శంకర్ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు ఫ్యాన్స్. ఉస్తాద్ భగత్ సింగ్ లో మరోసారి పోలీస్ పాత్రలో కనిపించనున్నారు పవన్.

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. తమిళ బ్లాక్ బస్టర్ థెరికి అఫీషియల్ రీమేక్ ఈ చిత్రం. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పవన్ సరసన శ్రీలీల నటిస్తోంది. ఈ చిత్రాన్ని 2024 సంక్రాతికి విడుదల చేయనున్నట్టు సమాచారం.   

You may also like
హరిహర వీరమల్లు రిలీజ్.. సీఎం చంద్రబాబు స్పెషల్ విషెస్!
harihara veeramallu trailer
హరిహర వీరమల్లు ట్రైలర్ పై చిరంజీవి ఇంట్రెస్టింగ్ ట్వీట్!
pawan watches hhvm trailer
హరిహర వీరమల్లు ట్రైలర్ కు పవన్ కళ్యాణ్ ఫిదా.. వీడియో వైరల్!
harihara veera mallu
హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ వచ్చేసింది!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions