Wednesday 15th April 2026
12:07:03 PM
Home > తాజా > పాకిస్తాన్ జెండాకు, ఇస్లామిక్ జెండాకు తేడా తెలియదా: ఎమ్మెల్యే రాజాసింగ్!

పాకిస్తాన్ జెండాకు, ఇస్లామిక్ జెండాకు తేడా తెలియదా: ఎమ్మెల్యే రాజాసింగ్!

raja singh

MLA Raja Singh Fires On Police | బీజేపీ ఎమ్యెల్యే రాజాసింగ్ (Raja Singh) తెలంగాణ పోలీసులపై ఫైర్ అయ్యారు. రాష్ట్ర పోలీసులకు పాకిస్తాన్ పై ఎందుకంత ప్రేమ అని ప్రశ్నించారు. జమ్మూ కశ్మీర్ లో పహల్గాంలో ఉగ్రదాడికి నిరసనగా ఎమ్మెల్యే రాజా సింగ్ తన కార్యాలయానికి వచ్చిపోయేవాళ్లు తొక్కుకుంటూ వెళ్లేలా పాకిస్తాన్ జెండాను నేలకు అతికించారు. అయితే దాన్ని పోలీసులు తొలగించారు. ఈ విషయంపై రాజా సింగ్ పోలీసులపై ఫైర్ అయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు.

పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా ఓ వైపు సీఎం రేవంత్ రెడ్డి, ఒవైసీ క్యాండిల్ ర్యాలీ చేస్తూ మరో వైపు ఆ ఆ దాడికి నిరసనగా పాకిస్తాన్ జెండాలు పెడితే వాటిని తొలగించాలని ఆదేశాలు ఇస్తున్నారని మండిపడ్డారు. ఈ రకమైన రాజకీయం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), పోలీసులకు మంచిదికాదన్నారు. పోలీసులకు ఇస్లామిక్ జెండాకు, పాకిస్తాన్ జెడాకు తేడా తెలియదా అని నిలదీశారు. పాకిస్తాన్ ను, ఉగ్రవాదులకు బుద్ధిచెప్పేందుకు ప్రధాని మోడీ ప్రయత్నిస్తుంటే తెలంగాణ పోలీసులు పాకిస్తాన్ జెండాలు ఎక్కడ పెడితే వాటిని తొలగిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు.

You may also like
Raja singh
‘ఆ రోడ్డుకు అమరవీరుల పేరు పెట్టొచ్చు కదా’
raja singh
హామీలకు డబ్బులు ఇటలీ నుండి తెస్తారా లేక..కాంగ్రెస్ పై రాజాసింగ్ సెటైర్లు..!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions