Sunday 2nd August 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > భారత్ – పాక్ ఉద్రిక్తతలపై అమెరికా కీలక సూచన!

భారత్ – పాక్ ఉద్రిక్తతలపై అమెరికా కీలక సూచన!

US comments on Indo Pak Situation | పహల్ గామ్ ఉగ్ర దాడి (Pahalgam Terror Attack) తర్వాత పాకిస్థాన్ – భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. పాక్ వెళ్లే సింధు జలాలను భారత్ నిలిపివేసింది.

మన దేశంలో ఉన్న పాకిస్థానీయుల వీసాలను రద్దు చేసింది. భారత్ లో ఉన్న పాకిస్తానీయులు అందరినీ దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. మరోవైపు అటారీ సరిహద్దును కూడా మూసివేసింది.  

తాజాగా భారత్ పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిణామాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

బాధ్యతాయుతమైన పరిష్కారం కోసం ఇరు దేశాలు కృషి చేయాలని అమెరికా విదేశాంగ శాఖ విజ్ఞప్తి చేసింది. ఈ విషయంలో భారత్ కు వాషింగ్టన్ అండగా ఉంటుందని స్పష్టం చేసింది.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions