Tuesday 4th August 2026
12:07:03 PM
Home > తాజా > సీఎం సహాయ నిధికి కుమారి ఆంటీ విరాళం.. ఎంతంటే!

సీఎం సహాయ నిధికి కుమారి ఆంటీ విరాళం.. ఎంతంటే!

Kumari Aunty meets cm revanth

Kumari Aunty Donation | హైదరాబాద్ లో ఫుడ్ స్టాల్ నిర్వహిస్తూ హఠాత్తుగా గుర్తింపు పొందిన కుమారి ఆంటీ (Kumari Aunty) తన కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని కలిశారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇటీవల వరదలు సంభవించిన నేపథ్యంలో సీఎం సహాయ నిధికి విరాళం అందజేశారు. రూ. 50 వేల చెక్కును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ కుమారి ఆంటీని శాలువాతో సత్కరించారు.

గతంలో హైదరాబాద్ లోని ఐటీసీ కొహీనూర్ సమీపంలో కుమారి ఆంటీ నిర్వహిస్తున్న ఫుడ్ స్టాల్ తో ట్రాఫిక్ జాం అవుతోందనీ, వెంటనే తొలగించాలని పోలీసులు ఆదేశించారు.

ఆమె ఆవేదన వ్యక్తం చేయడంతో సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారింది. దీంతో ఏకంగా సీఎం రేవంత్ స్పందించారు. ఆ ఫుడ్ స్టాల్ ను తొలగించొద్దని పోలీసులను ఆదేశించారు. కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ను ఓ రోజు సందర్శిస్తానని కూడా చెప్పారు.   

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
“మా పెద్దిని కాపాడండి”: డాక్టర్లకు కేసీఆర్ విజ్ఞప్తి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions