Tuesday 22nd September 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > మందుబాబులకు కిక్కిచ్చే వార్త.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం!

మందుబాబులకు కిక్కిచ్చే వార్త.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం!

Liquor Policy

AP Cabinet Meeting | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మందు బాబులకు మాంచి కిక్కిచ్చే వార్త చెప్పింది. రాష్ట్రంలో నూతన మద్యం విధానానికి సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ కేబినెట్ (AP Cabinet) ఆమోదం తెలిపింది.

సచివాలయంలో బుధవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నూతన మద్యం పాలసీ (AP Liquor Policy) కి ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పాలసీ ద్వారా రాష్ట్రంలో ప్రైవేట్ మద్యం దుకాణాలకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

అదే విధంగా రాష్ట్రంలో నాణ్యమైన మద్యం బ్రాండ్లను అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. సగటు మద్యం ధరను రూ.99 నుంచి అందుబాటులో ఉంచాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన వరద సాయం ప్యాకేజీకి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు విమానాశ్రయంగా పేరు మార్చే ప్రతిపాదనకు కూడా ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

You may also like
కుంకీ ఏనుగులకు స్వాగతం పలికిన డిప్యూటీ సీఎం పవన్!
ప్రార్థనా స్థలాల్లో లౌడ్ స్పీకర్ల గోల.. డీజీపీకి రఘురామ కృష్ణంరాజు లేఖ!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
నిజాయతీలో మా పిల్లలు బంగారం.. విద్యార్థినులపై మంత్రి లోకేశ్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions