Saturday 6th June 2026
12:07:03 PM
Home > క్రీడలు > సచిన్ టెండూల్కర్ 37 ఏళ్ల రికార్డును బ్రేక్ వైభవ్ సూర్యవంశీ!

సచిన్ టెండూల్కర్ 37 ఏళ్ల రికార్డును బ్రేక్ వైభవ్ సూర్యవంశీ!

  • 15 ఏళ్లకే టీమిండియా జట్టులోకి

Vaibhav Suryavanshi Breaks Sachin Record | భారత క్రికెట్‌లో సరికొత్త శకం మొదలైంది. ఐపీఎల్‌లో పరుగుల విధ్వంసం సృష్టించిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఒక చారిత్రాత్మక రికార్డును బద్దలు కొట్టాడు.

ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల కోసం బిసిసిఐ (BCCI) తాజాగా ప్రకటించిన భారత టీ20 జట్టులో వైభవ్ చోటు దక్కించుకున్నాడు. ఈ ఎంపికతో కేవలం 15 ఏళ్ల వయస్సులోనే భారత జాతీయ జట్టుకు ఎంపికైన తొలి ఆటగాడిగా వైభవ్ సరికొత్త రికార్డును తన లిఖించుకున్నాడు.

సచిన్ 37 ఏళ్ల రికార్డు బద్దలు..
గతంలో 1989వ సంవత్సరంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన 16 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేసి, అతి పిన్న వయస్సులో టీమిండియాకు ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించారు. దాదాపు 37 ఏళ్ల తర్వాత ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ కేవలం 15 ఏళ్లకే జాతీయ జట్టుకు ఎంపికై సచిన్ రికార్డును తిరగరాశాడు.

వైభవ్ ఇంటర్నేషనల్ ఎంట్రీపై బిసిసిఐ సైతం సానుకూలంగా స్పందిస్తూ.. అతడిని భారత క్రికెట్‌లో ఒక “గేమ్ ఛేంజర్” అని అభివర్ణించింది.

ఇటీవల ముగిసిన ఐపీఎల్-2026 సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ముఖ్యంగా ఒత్తిడితో కూడిన ప్లేఆఫ్స్ (Playoffs) మ్యాచ్‌లలో ఏకంగా 90 కంటే ఎక్కువ పరుగులు చేసి ఒంటరి పోరాటంతో అందరినీ ఆకట్టుకున్నాడు.

ఈ సీజన్ మొత్తంలో ఆడిన 16 మ్యాచ్‌లలో ఏకంగా 776 పరుగులు సాధించి ప్రతిష్టాత్మక ‘ఆరెంజ్ క్యాప్’ (Orange Cap)ను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌లో చూపించిన ఈ అసాధారణ ప్రతిభే అతనికి టీమిండియాలో చోటు దక్కేలా చేసింది.

You may also like
bcci
టీమిండియాలో సర్పంచ్ శకం.. టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions