Thursday 15th October 2026
12:07:03 PM
Home > తాజా > సైబర్ నేర బాధితులకు శుభవార్త

సైబర్ నేర బాధితులకు శుభవార్త

Hyderabad police launch C-Mitra to enable cybercrime FIRs from home | సైబర్ నేర బాధితులకు తెలంగాణ పోలీసులు శుభవార్త అందించారు. ఇకపై పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే ‘C-Mitra’ ద్వారా సైబర్ క్రైమ్ FIR నమోదు చేయొచ్చు. డిజిటల్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు, ఫిర్యాదు ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ఈ వినూత్న ప్రయత్నం చేపట్టారు పోలీసులు.

సైబర్ క్రైం బాధితులకు అండగా నిలుస్తూ, వారు పోలీస్ స్టేషన్‌కు వెళ్లే శ్రమ లేకుండా త్వరితగతిన న్యాయం అందించేందుకు దేశంలోనే తొలిసారిగా ‘సీ-మిత్ర’ (C-Mitra) అనే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ప్రకటించారు హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్. సీ-మిత్ర ద్వారా ఫిర్యాదు చేయడం మొదలుకొని, ఎఫ్ఐఆర్ నమోదు అయ్యే వరకూ అంతా ఇంటి నుంచే పూర్తవుతుందన్నారు. కృత్రిమ మేధ (AI) సహకారంతో వర్చువల్ హెల్ప్‌డెస్క్ ద్వారా ఫిర్యాదు ప్రక్రియ సులభతరం కానుందని వెల్లడించారు.

You may also like
జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ!
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions