Hardik Pandya Breaks Virat Kohli’s Instagram Record | టీం ఇండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు.
టీం ఇండియా ఆటగాడు, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ రికార్డును హార్దిక్ బ్రేక్ చేశారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్స్ లో న్యూజీలాండ్ ను ఓడించి టీం ఇండియా విజేతగా నిలిచింది. తెల్లటి సూట్లు ధరించిన ఆటగాళ్లు ఛాంపియన్స్ ట్రోఫీని అందుకున్నారు.
అనంతరం మైదానంలో ప్లేయర్లు కప్పుతో ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్య ట్రోఫీతో దిగిన ఫోటో తెగ వైరల్ గా మారింది. దుబాయ్ స్టేడియంలోని పిచ్ పై ట్రోఫీని పెట్టి హార్దిక్ పాండ్య ఫొటోకు ఫోజు ఇచ్చాడు.
అనంతరం ఫోటోను ఇన్స్టాగ్రామ్ ( Instagram ) లో పోస్ట్ చేయగా, క్షణాల వ్యవధిలోనే లక్షల లైకులను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే హార్దిక్, విరాట్ రికార్డును బ్రేక్ చేశారు. 2024 టీ-20 వరల్డ్ కప్ విక్టరీ అనంతరం విరాట్ పోస్ట్ చేసిన ఫొటో ఏడు నిమిషాల్లో మిలియన్ లైకులను సొంతం చేసుకోగా, హార్దిక్ పోస్ట్ చేసిన ఫోటో కేవలం ఆరు నిమిషాల్లోనే మిలియన్ లైకులను సాధించింది.