Friday 8th August 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > పోలీస్ వ్యాన్ లో గణపతి విగ్రహం..వివాదంపై క్లారిటీ

పోలీస్ వ్యాన్ లో గణపతి విగ్రహం..వివాదంపై క్లారిటీ

Ganesha Idol In Bengaluru Police Van | కర్ణాటక రాష్ట్రంలో ఓ పోలీస్ వ్యాను ( Police Van )లో వినాయక విగ్రహాన్ని తరలించడం తీవ్ర వివాదంగా మారింది.

ఆ రాష్ట్రంలోని నాగమంగలంలో ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణలను నిరసిస్తూ బెంగుళూరులో హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. అయితే దీనికి కోర్టు అనుమతి లేకపోవడంతో పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.

వారి దగ్గర ఉన్న వినాయకుడి విగ్రహాన్ని పోలీస్ వ్యాన్ లో పెట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై బీజేపీ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ వినాయకుడ్ని కూడా అరెస్ట్ చేసిందిని ప్రధాని మోదీ ( Pm Modi ) సైతం విమర్శించారు. ఈ క్రమంలో వ్యాన్ లో వినాయక విగ్రహంపై బెంగుళూరు పోలీసులు క్లారిటీ ఇచ్చారు.

అనుమతి లేకుండా ఆందోళన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుని, అనంతరం వారివద్ద ఉన్న విగ్రహాన్ని వ్యాన్ లో పెట్టినట్లు పోలీసులు చెప్పారు. ఆ తర్వాత సంప్రదాయబద్ధంగానే నిమర్జనం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

You may also like
కేవలం 22 నిమిషాల్లో ‘ఆపరేషన్ సింధూర్’ పూర్తి
Karnataka CM Siddaramaiah stuck in traffic
కర్ణాటక ముఖ్యమంత్రికి సారీ చెప్పిన మెటా.. కారణం ఏంటంటే!
‘125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్’
‘వారానికి 100 గంటలు పనిచేసే ఏకైక వ్యక్తి ప్రధాని మోదీ’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions