Sunday 26th January 2025
12:07:03 PM
Home > తెలంగాణ > రేవంత్ పుట్టినిల్లు బిఆర్ఎస్ పార్టీ అని మరవద్దు: నిరంజన్ రెడ్డి

రేవంత్ పుట్టినిల్లు బిఆర్ఎస్ పార్టీ అని మరవద్దు: నిరంజన్ రెడ్డి

Ex Minister Niranjan Reddy | మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన వనపర్తిలో మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్బంగా బుధవారం అసెంబ్లీలో సీఎం రేవంత్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మధ్య జరిగిన వాగ్వాదంపై స్పందించారు.

అసెంబ్లీ సాక్షిగా అక్కలను నమ్ముకుంటే మునుగుతారు,బతుకు బస్ స్టాండ్ అవుతుందని అవమానించిడం తప్పు అని అభిప్రాయపడ్డారు. సీఎం వ్యాఖ్యలు సీఎం పదవికి కళంకమన్నారు. సీనియర్ శాసన సభ్యులు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి రేవంత్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవారు హుందాతనాన్ని కాపాడాలనీ, ప్రతిపక్షాలను గౌరవించాలని సూచించారు. రేవంత్ పుట్టినిల్లు బి.ఆర్.ఎస్. పార్టీ అని మరవద్దని చెప్పారు. అహంకారంతో మాట్లాడితే అంతం కాక తప్పదని నిరంజన్ రెడ్డి హెచ్చరించారు.

Read Also: సునితక్క ప్రచారం కోసం వెళ్తే నా పై రెండు కేసులు పెట్టారు : సీఎం రేవంత్

కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు కాక రైతులు,నిరుద్యోగులు, అగన్వాడి టీచర్లు,ఆశా కార్యకర్తలు,ఆరోగ్య కార్యకర్తలు,ఆటో యూనియన్ కార్మికులు ఒకవైపు ఆందోళనలు చేస్తుంటే వారి దృష్టి మరాల్చడానికి సంబంధం లేకుండా రాజకీయ ప్రేరిపిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు.

క్షుద్రరాజకీయాలే శరణ్యంగా ఉన్న రాజకీయాలు చేస్తున్న ముఖ్యమంత్రి మునిగిపోవడం ఖాయం. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల  ఇండ్లకు  వెళ్లి బేరసారాలు ఆడుతున్న రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు.

గతంలో చట్టబద్ధంగా బీఆర్ఎస్ పార్టీ విపక్ష ఎమ్మెల్యేలను విలీనం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. హోల్ సేల్ గా రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం  మోసం చేసిందని విమర్శించారు. రాజకీయాలలో ఓటమి గెలుపులు సహజం అహంకారం పనికిరాదని హితవు పలికారు.

2018ఎన్నికలో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాను అన్న మాటకు రేవంత్ కట్టుబడి ఉన్నడా? అని ప్రశ్నించారు. పాలన శూన్యం చేసి హామీలు అటకెకించి కాలయాపన చేస్తూ నమ్మిన ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు.  

You may also like
bandi sanjay
ఆ పేరు పెడితే ఇండ్లు ఇవ్వం..బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు!
kcr sister cheeti sakalamma
కేసీఆర్ సోదరి మృతి.. నివాళి అర్పించిన బీఆర్ఎస్ అధినేత!
‘లైలా గెటప్..మా నాన్నే నన్ను గుర్తుపట్టలేదు’
వారి కోసమే ఆ సెలబ్రేషన్స్..క్లారిటీ ఇచ్చిన అభిషేక్ శర్మ

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions