Tuesday 17th February 2026
12:07:03 PM
Home > తాజా > ప్రేమ గెలిచింది..ఆరేళ్ల క్రితం తప్పిపోయిన తండ్రిని అనాథాశ్రమంలో కలిసిన బిడ్డలు!

ప్రేమ గెలిచింది..ఆరేళ్ల క్రితం తప్పిపోయిన తండ్రిని అనాథాశ్రమంలో కలిసిన బిడ్డలు!

Daughters Found Their Father After six years At orphanage | హైదరాబాద్ నగరంలో మనసును హత్తుకునే ఓ భావోద్వేగ ఘటన చోటు చేసుకుంది. ఆరేళ్ళ కిందట తప్పిపోయిన తండ్రిని అతని కూతుర్లు ఓ అనాథాశ్రమంలో కలిశారు.

వారి కలయిక అందర్నీ భావోద్వేగానికి గురి చేసింది. హైదరాబాద్ మాతృదేవోభవ అనాథ ఆశ్రమం ( Orphanage ) ఆరేళ్ళ క్రితం బాలయ్య అనే వ్యక్తిని చేరదీసింది. మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తికి ఆ ఆశ్రమంలో చోటుకల్పించారు.

మరోవైపు బాలయ్య కూతుర్లు దివ్య, లావణ్య తప్పిపోయిన తండ్రి కోసం వెతుకుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజగా వారు మాతృదేవోభవ ఆశ్రమానికి అన్నదానం చేయడానికి కూతుర్లు వెళ్లారు.

ఈ సందర్భంగా ఆశ్రమంలో ఆరేళ్ళ క్రితం తప్పిపోయిన తండ్రిని చూసి, ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. తండ్రిని హత్తుకుని కన్నీరు పెట్టుకున్నారు. కూతుర్లను గుర్తుపట్టిన తండ్రి బాలయ్య కూడా ఏడ్చారు. మనవళ్ళు, మనవరాళ్లను కలిశారు.

అనంతరం బాలయ్యను కూతుర్లు తమ వెంట తీసుకెళ్లారు. ఈ ఘటన మానవ సంబంధాల ఎలా ఉంటాయో అద్భుతంగా అద్దం పట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ ( Viral ) గా మారింది.

You may also like
punch story
బొమ్మనే తల్లి భావించి..మనసుల్ని కదిలిస్తున్న‘పంచ్’ కథ!  
minister komatireddy
మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి!
kcr revanth
కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్!
ఇంకా తేలని జనగామ

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions