Monday 28th September 2026
12:07:03 PM
Home > తాజా > మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. ఓటేసిన ప్రముఖలు.. ఎక్కడెక్కడంటే!

మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. ఓటేసిన ప్రముఖలు.. ఎక్కడెక్కడంటే!

municipality

Municipal Elections Poling in TG | తెలంగాణ (Telangana) రాష్ట్రవ్యాప్తంగా బుధవారం మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్  సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతోంది.

ఈ సందర్భంగా రాజకీయ ప్రముఖుల తమ స్వస్థలాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం, కొడంగల్ మున్సిపాలిటీలోని జిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఓటు వేశారు.

ఈ సందర్బంగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్య సౌధానికి పునాది ఓటు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఈ రోజు కొడంగల్ లో నా ఓటు హక్కును వినియోగించుకున్నాను.

ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నాను. అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సీఎం రేవంత్. మధిర మున్సిపాలిటీలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, నల్లగొండ జిల్లా పబ్లిక్ స్కూల్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కుటుంబసభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

You may also like
జపాన్‌ సాంకేతిక విద్యపై తెలంగాణ దృష్టి!
తస్మాత్ జాగ్రత్త.. సెల్ ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ!
“మా పెద్దిని కాపాడండి”: డాక్టర్లకు కేసీఆర్ విజ్ఞప్తి!
TG Heat Wave Alert
తెలంగాణ ప్రజలకు అలర్ట్.. తప్పనిసరి అయితేనే బయటకు రండి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions