Digital Health Cards | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రజలకు ఓ శుభవార్త చెప్పారు. నెల రోజుల్లోనే రాష్ట్రంలో ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు జారీ చేస్తామని ప్రకటించారు. గురువారం విద్యానగర్ లోని దుర్గాబాయ్ దేశ్ ముఖ్ రెనెవా క్యాన్సర్ ఆసుపత్రిని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ మెరుగైన వైద్య సదుపాయాలు అందించడమే తమ ప్రభుత్వం లక్ష్యం అన్నారు. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ముందు చూపు వల్లే దేశంలో వైద్య రంగం గణనీయమైన అభివృద్ది సాధించిందని తెలిపారు.
క్యాన్సర్ వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన చాలా తక్కు వగా ఉందన్నారు. క్యాన్సర్ వ్యా ధికి వైద్య సదుపాయాలు మన దగ్గర తక్కువగా ఉన్నాయని, చికిత్స కు అయ్యే ఖర్చు మాత్రం సామాన్యు లకు అం దుబాటులో లేదని అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో మరిన్ని క్యాన్సర్ ఆసుపత్రులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. సామాన్యు లకు కూడా క్యా న్సర్ చికిత్స లు అం దుబాటులోకి రావాలని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.