YCP Leaders Join Janasena | ఆంధ్ర ప్రదేశ్లో వైఎస్ఆర్ సీపీ (YSRCP) కి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు జనసేన (Janasena)లో చేరారు.
ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులరెడ్డి (Balineni Srinivasa Reddy), మాజీ ఎమ్మె ల్యే లు సామినేని ఉదయభాను (Samineni UdayaBhanu), కిలారు రోశయ్య (Kilaru Rosaiah) జనసేనలో చేరారు.
ఏపీ డిప్యూ టీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సమక్షంలో వారు జనసేన తీర్థం పుచ్చుకున్నారు.
వీరితోపాటు ఒంగోలు, జగ్గయ్యపేట, పొన్నూరు నియోజకవర్గాలకు చెందిన పలువురు కీలక నేతలు సైతం పవన్ సమక్షంలో జనసేన కండువా కప్పుకొన్నా రు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడం, ఆ తర్వా త పార్టీలో సరైన ప్రాధాన్యత లేకపోవడంతో బాలినేని, ఉదయ భాను, రోశయ్య వైఎస్సా ర్ కాంగ్రెస్‌కి గుడ్ బై చెప్పారు.