Wednesday 19th August 2026
12:07:03 PM
Home > తాజా > CEIR పోర్టల్ ద్వారా 25 పోగొట్టుకున్న ఫోన్లు రికవరీ!

CEIR పోర్టల్ ద్వారా 25 పోగొట్టుకున్న ఫోన్లు రికవరీ!

  • బాధితులకు అందజేసిన అత్తాపూర్ పోలీసులు!

CEIR Portal | కేంద్ర ప్రభుత్వ ‘సి.ఇ.ఐ.ఆర్’ (CEIR – Central Equipment Identity Register) పోర్టల్ సహాయంతో రాజేంద్రనగర్ జోన్ పరిధిలోని అత్తాపూర్ పోలీసులు ప్రతిభ చాటారు. రికవరీ చేసిన సుమారు రూ. 2,00,000/- (రెండు లక్షల రూపాయలు) విలువ కలిగిన 25 మొబైల్ ఫోన్లను బుధవారం నాడు బాధితులకు పోలీసు అధికారులు అందజేశారు.

బాధితులకు ఫోన్ల అందజేత..

అత్తాపూర్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (Inspector of Police) శ్రీ ఎ. సీతయ్య గారు ఫోన్ బాధితులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి, తగిన ఆధారాలు సరిచూసుకున్న అనంతరం వారి మొబైల్ ఫోన్లను నేరుగా అందజేశారు.

పోయాయనుకున్న తమ విలువైన ఫోన్లు తిరిగి లభించడంతో బాధితులు తీవ్ర ఆనందం వ్యక్తం చేస్తూ, అత్తాపూర్ పోలీసులకు మరియు క్రైమ్ టీమ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

CEIR పోర్టల్‌పై అవగాహన – ఇన్స్పెక్టర్ సీతయ్య సూచనలు..

ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ శ్రీ ఎ. సీతయ్య గారు మాట్లాడుతూ ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు. వెంటనే ఫిర్యాదు చేయాలి.

ఎవరైనా తమ మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్నా లేదా దొంగతనానికి గురైనా కంగారు పడకుండా వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో గానీ లేదా ఆన్‌లైన్ ద్వారా ceir.sancharsaathi.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేసుకోవాలి.

CEIR పోర్టల్‌లో ఐఎంఈఐ (IMEI) నంబర్‌ను బ్లాక్ చేయడం ద్వారా ఫోన్ దుర్వినియోగం కాకుండా చూడటమే కాకుండా, దానిని త్వరగా ట్రాక్ చేసి రికవరీ చేయడానికి సులభమవుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అత్తాపూర్ పోలీస్ స్టేషన్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ (DI) శ్రీ రాజు నాయక్ గారితో పాటు క్రైమ్ టీమ్ సిబ్బంది పాల్గొన్నారు.

You may also like
సనత్ నగర్ టిమ్స్ ప్రారంభించిన సీఎం రేవంత్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions