Friday 16th October 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > రాష్ట్రంలో భారీ పేలుడు..భారీగా మృతులు

రాష్ట్రంలో భారీ పేలుడు..భారీగా మృతులు

Blast in Fireworks Manufacturing Unit in AP | ఆంధ్రప్రదేశ్ లోని ఓ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 20 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మరొకొందరికి తీవ్ర గాయాలయ్యాయి. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం పరిధిలోని గోదావరి కెనాల్ సమీపంలో పొలాల మధ్య శ్రీసూర్య ఫైర్ వర్క్స్ అనే బాణసంచా తయారీ కేంద్రం ఉంది. శనివారం మధ్యాహ్నం ఈ కేంద్రంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. దింతో ఈ కేంద్రంలో పని చేస్తున్న రోజూవారి కూలీలు 20 మంది వరకు మృతి చెందినట్లు తెలుస్తోంది.

మరో పది మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు శబ్దం సుమారు 5 కి.మీ. వరకు వినిపించిందని, పక్క గ్రామంలో ఉన్న ఓ పాఠశాల స్లాబ్ కు పగుళ్లు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. పేలుడు ధాటికి మృతదేహాలు గాల్లోకి ఎగిరిపడినట్లు కథనాలు వస్తున్నాయి. గాయపడిన వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పుతున్నారు.

You may also like
జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ!
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions