Monday 14th September 2026
12:07:03 PM
Home > తెలంగాణ > పవన్ వ్యూహాలతో ఆ ఎన్నికల్లో గెలిచాం: బీజేపీ ఎంపీ లక్ష్మణ్!

పవన్ వ్యూహాలతో ఆ ఎన్నికల్లో గెలిచాం: బీజేపీ ఎంపీ లక్ష్మణ్!

bjp mp k laxman

బీజేపీ ఎంపీ డా.లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యూహాలు మూలంగానే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయాన్ని సాధించిందని వ్యాఖ్యానించారు.

నవంబర్ 7న ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటిస్తారని, అలాగే బీజేపీ ఆధ్వర్యం లో జరిగే బీసీ బహిరంగ సభలో పాల్గొంటారని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఒక ప్రభలమైన శక్తిగా ఎదగిందన్నారు.

టీడీపీ తమ భాగస్వామ్య పార్టీ కాదనీ, కానీ జనసేన మాత్రం ఎన్డీయే కూటమిలో భాగం అని స్పష్టం చేశారు. పరస్పర లాభాలు ఉంటేనే పొత్తులు ఉంటాయన్నారు.

రాష్ట్ర ప్రయోజనాలే కాకుండా, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పొత్తులో భాగంగా కొన్ని సీట్లు ఇతర పార్టీలకు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ జనసేన కూటమి తరఫున ప్రచారం చేస్తారని పేర్కొన్నారు లక్ష్మణ్.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
కుంకీ ఏనుగులకు స్వాగతం పలికిన డిప్యూటీ సీఎం పవన్!
pawan annamalai
పవనన్నా మీ నిర్ణయం ప్రశంసనీయంఅన్నామలై ఆసక్తికర వ్యాఖ్యలు!
engineering fee in tg
రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఫీజులు ఖరారు.. అత్యధికం ఎంతంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions