Sunday 26th January 2025
12:07:03 PM
Home > తెలంగాణ > చంద్రబాబుపై మరో కేసు.. ఈసారి తెలంగాణలో!

చంద్రబాబుపై మరో కేసు.. ఈసారి తెలంగాణలో!

టీడీపీ అధినేత చంద్రబాబు పై తెలంగాణ రాష్ట్రంలో కేసు నమోదయింది. ఈ మేరకు సబ్ ఇన్స్పెక్టర్ జయచందర్ ఫిర్యాదు మేరకు బేగంపేట పోలీసులు ఫిర్యాదు నమోదు చేశారు.

మధ్యంతర బెయిల్ పై విడుదల అయిన చంద్రబాబు బుధవారం హైదరాబాద్ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో బేగంపేట విమానాశ్రయం నుండి జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసం వరకు భారీ ర్యాలీని చేపట్టాయి టీడీపీ శ్రేణులు.

కాగా ఎటువంటి అనుమతి లేకుండానే ఈ ర్యాలీని నిర్వహించినట్లు, ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

అంతేకాకుండా రెండు గంటల పాటు రోడ్ల పై న్యూసెన్స్ చేశారని, ట్రాఫిక్ మూలంగా సామాన్యులను ఇబ్బందులకు గురి చేశారని ఎస్సై జయచంధర్ తన పిర్యాదు లో పేర్కొన్నారు.

ర్యాలీ నిర్వహించిన హైదరాబాద్ సిటీ టీడీపీ జనరల్ సెక్రెటరీ GVG నాయుడు సహా పలువురిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇదిలా ఉండగా వైద్య పరీక్షల నిమిత్తం గచ్చిబౌలి లోని ఏఐజి ఆసుపత్రికి చేరుకున్నారు చంద్రబాబు.

You may also like
nara lokesh
టీడీపీ కార్యకర్తలకు ప్రమాద బీమా.. రూ. 42 కోట్లు చెల్లించిన పార్టీ!
adr releases assets of chief ministers in india
దేశంలో రిచెస్ట్ సీఎం ఎవరో తెలుసా..!
parcel
ఫేక్ పార్సిల్స్ వస్తున్నాయ్.. బీ అలెర్ట్!
cbn
TTS నిబంధనలు పాటించాల్సిందే.. చంద్రబాబు కీలక ట్వీట్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions