Jay Shah as ICC Chairman | ఐసీసీ (ICC – International Cricket Council) చైర్మన్‌గా ప్రస్తుత బీసీసీఐ చైర్మన్ జైషా ఏక్రగీవంగా ఎన్నికయ్యా రు. ఈ మేరకు మంగళవారం ఐసీసీ అధికారిక ప్రకటన చేసింది., 2024 నుంచి డిసెంబర్ 1 ఆయన ఐసీసీ చైర్మన్ గా బాధ్యతలు చేపడతారు.
ప్రస్తుత చైర్మన్ బార్ క్లే పదవీకాలం ఈ ఏడాది నవంబర్‌తో ముగుస్తుంది. అయితే రెండోసారి చైర్మన్ బాధ్యతలు స్వీకరించడానికి ఆయన విముఖత చూపారు. దీంతో జై షా ఎన్నిక ఏకగ్రీవం అయింది.
ఐసీసీ బోర్డులో మొత్తం 16 మంది సభ్యులు ఉంటారు. ఎవరైనా ఐసీసీ చైర్మన్‌గా ఎన్నికవ్వాలంటే ఆ 16 మంది సభ్యుల్లో కనీసం 9 మంది మద్దతు కావాలి. అయితే తాజాగా జై షాకు బోర్డులోని 16 మంది సభ్యుల్లో అందరి మద్దతు లభించింది. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది.
ఐసీసీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన అతిపిన్న వయస్కుడిగా జై షా రికార్డు నెలకొల్పారు. గతంలో భారత్ నుంచి జగ్మోహన్ దాల్మియా (1997-2000), శరద్ పవార్ (2010-2012) ఐసీసీ ప్రెసిడెంట్ గా పనిచేశారు.