Thursday 17th September 2026
12:07:03 PM
Home > క్రీడలు > T20 ప్రపంచకప్: బంగ్లాదేశ్ జట్టు సంచలన నిర్ణయం!

T20 ప్రపంచకప్: బంగ్లాదేశ్ జట్టు సంచలన నిర్ణయం!

bcb out from t20 world cup

Bangladesh out from T20 World Cup | బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు (Bangladesh Cricket Board) సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్ శ్రీలంక వేదికగా ఫిబ్రవరిలో ప్రారంభంకానున్న టీ20 ప్రపంచకప్‌–2026లో పాల్గొనడం లేదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.

భారత్‌లో జరగనున్న తమ మ్యాచ్‌లకు భద్రతా సమస్యలు, రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నాయని పేర్కొంటూ అక్కడ ఆడేందుకు నిరాకరిస్తున్నట్లు స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో గ్రూప్ సీలో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌ను టోర్నీలోకి చేర్చినట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించింది.

తమ మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలని బీసీబీ చేసిన విజ్ఞప్తిని ఐసీసీ తిరస్కరించింది. జనవరి 21న జరిగిన సమావేశంలో భారత్‌లో భద్రతకు ఎలాంటి ప్రమాదం లేదని, షెడ్యూల్ మార్పు సాధ్యం కాదని ఐసీసీ తేల్చింది.

భారత్‌లో ఆడేందుకు ఇచ్చిన గడువును కూడా బీసీబీ అంగీకరించలేదు. ఈ పరిణామాలపై ఢాకాలో బీసీబీ అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం, క్రీడా సలహాదారు అసిఫ్ నజ్రుల్‌తో పాటు సీనియర్ ఆటగాళ్లు సమావేశమయ్యారు.

ఆటగాళ్లు ప్రపంచకప్ ఆడాలనుకున్నప్పటికీ, ప్రభుత్వ నిర్ణయానికే కట్టుబడాలని నిర్ణయించారు. ఐసీసీతో చర్చలు కొనసాగుతాయని బీసీబీ వెల్లడించింది. గతంలో ఐపీఎల్ విషయంలో చోటుచేసుకున్న వివాదాలే తాజా ఉద్రిక్తతలకు కారణమని విశ్లేషిస్తున్నారు.  

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions