Monday 26th October 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > రాహుల్‌ గాంధీ కాన్వాయ్‌లో యాక్సిడెంట్!

రాహుల్‌ గాంధీ కాన్వాయ్‌లో యాక్సిడెంట్!

  • తృటిలో తప్పిన పెనుప్రమాదం!

Rahul Gandhi Convoy Accident కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లో స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఆయన కాన్వాయ్‌లో వెనుక వస్తున్న వాహనాలు ఒకదానికొకటి వరుసగా ఢీకొన్నాయి. అయితే రాహుల్‌ గాంధీ ప్రయాణిస్తున్న ప్రధాన కారు మాత్రం ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడింది.

ఈ ఘటనలో రాహుల్ గాంధీ పూర్తిగా క్షేమంగా ఉన్నట్లు సమాచారం. సోమవారం లఖ్‌నవూ నుంచి సుల్తాన్‌పుర్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సుల్తాన్‌పుర్‌ జిల్లాలోని హలియాపుర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో, పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై 89.5 కిలోమీటరు మైలురాయి వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఐదు వాహనాలు, అంబులెన్స్ ఢీ..

అందిన సమాచారం ప్రకారం.. కాన్వాయ్‌లోని ఐదు కార్లు, ఒక అంబులెన్స్ పరస్పరం ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ వరుస రోడ్డు ప్రమాదంలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు, భద్రతా సిబ్బందికి గాయాలైనట్లు తెలుస్తోంది. అయితే క్షతగాత్రుల కచ్చితమైన సంఖ్యపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

కోర్టు విచారణకు వెళ్తుండగా..

2018 నాటి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల పరువునష్టం కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం రాహుల్ గాంధీ సుల్తాన్‌పుర్‌ కోర్టుకు బయలుదేరారు. ఈ కేసులో సోమవారమే తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఆయన లఖ్‌నవూ నుంచి రోడ్డు మార్గంలో వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. ప్రమాదానికి అసలు కారణాలు ఏమిటనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

You may also like
TN రాజకీయాల్లో ‘ధనుష్’ ఎంట్రీ హడావుడి: వెండి దీపాలపై ‘కమలం’ గుర్తు!
కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు ఇవ్వబోం: అన్నామలై!
అభిమానం హద్దులు దాటితే.. హీరోయిన్ తాగిన వాటర్ బాటిల్ రూ. 3 లక్షలకు అమ్మకానికి!
tg high court
సరా సెలవుల్లో ఆస్తులపై ఎలాంటి చర్యలు వద్దు: హైకోర్టు కీలక ఆదేశాలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions