Sunday 4th October 2026
12:07:03 PM
Home > తాజా > సనత్ నగర్ టిమ్స్ ప్రారంభించిన సీఎం రేవంత్!

సనత్ నగర్ టిమ్స్ ప్రారంభించిన సీఎం రేవంత్!

  • అందుబాటులోకి కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు!

CM Revanth Inaugurates Sanath Nagar TIMS | అత్యధునిక వైద్య సదుపాయాలతో సనత్ నగర్‌లో నిర్మించిన ‘మర్రి చెన్నారెడ్డి టిమ్స్’ (TIMS – Telangana Institute of Medical Sciences) సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం ప్రారంభించారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వైద్యఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ మరియు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

ప్రారంభోత్సవం అనంతరం సీఎం మరియు ఇతర నేతలు ఓపీ కౌంటర్ వద్దకు వెళ్లి సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఆసుపత్రి ప్రత్యేకతలు & వసతులు..

సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రిని సుమారు రూ. 1,126 కోట్ల వ్యయంతో నిర్మించారు. 1082 పడకల సామర్థ్యం: పేద, మధ్యతరగతి ప్రజలకు రూపాయి ఖర్చు లేకుండా కార్పొరేట్ తరహా వైద్యం అందించడమే లక్ష్యంగా 1082 పడకల సామర్థ్యంతో దీనిని అందుబాటులోకి తెచ్చారు.

ఐసీయూ & ఆపరేషన్ థియేటర్లు: క్రిటికల్ కేర్ కోసం ప్రత్యేకంగా 300 ఐసీయూ (ICU) బెడ్లు, సంక్లిష్టమైన సర్జరీల కోసం 31 అత్యధునిక మేజర్ ఆపరేషన్ థియేటర్లను సిద్ధం చేశారు.

పూర్తిస్థాయి సేవలు: నిన్నటివరకు కేవలం సాధారణ ఓపీ సేవలు, ట్రయల్ రన్ మాత్రమే కొనసాగగా, ఈ ప్రారంభోత్సవంతో పూర్తిస్థాయి సూపర్‌స్పెషాలిటీ సేవలు రోగులకు అందుబాటులోకి వచ్చాయి.

సమగ్ర వైద్యం.. ఒకే ప్రాంగణం..

గుండె, కిడ్నీ, కాలేయం, మెదడు సంబంధిత వ్యాధులతో పాటు అత్యవసర ట్రామా, క్యాన్సర్, అవయవ మార్పిడి వంటి 37 ప్రధాన వైద్య విభాగాలకు చెందిన నిపుణులు ఈ ఆసుపత్రిలో సేవలు అందించనున్నారు.

కార్డియాక్, రీనల్, న్యూరో, ట్రామా వంటి కీలక రంగాల్లో ప్రత్యేక ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ కేంద్రాలతో పాటు ఆధునిక ఇంటర్వెన్షనల్ రేడియాలజీ, డయాగ్నస్టిక్ ల్యాబ్‌లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.

ఈ భారీ ప్రాజెక్టు అందుబాటులోకి రావడంతో హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గి, రోగులకు నాణ్యమైన వైద్యం మరింత చేరువ కానుంది.

You may also like
ఆయన వన్ టైం వండర్.. సీఎం రేవంత్ పై సంజయ్ బారు కీలక వ్యాఖ్యలు!
మీరాలం ట్యాంక్ అభివృద్ధి పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీఎం!
HYDERABAD: గచ్ఛిబౌలి లో ఘోర ప్రమాదం!
CEIR పోర్టల్ ద్వారా 25 పోగొట్టుకున్న ఫోన్లు రికవరీ!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions