Wednesday 30th September 2026
12:07:03 PM
Home > తాజా > గోల్కొండ కోటపై జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి!

గోల్కొండ కోటపై జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి!

Independence Day Celebrations At Golconda | తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా, ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగాయి. చారిత్రాత్మక గోల్కొండ కోట వేదికగా జరిగిన ప్రధాన ఉత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

గోల్కొండపై తొలిసారి వందేమాతరం – సీఎం రేవంత్ నివాళులు..

గోల్కొండ కోటపై వేడుకల సందర్భంగా తొలిసారిగా వందేమాతరం గీతాన్ని ఆలపించడం ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేడుకలకు ముందు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వద్ద ఉన్న అమర జవాన్ల స్తూపం వద్ద సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం గోల్కొండ కోట వద్ద పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి, మువ్వన్నెల జెండాను ఎగురవేశారు.

ఖమ్మంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క – అభివృద్ధి ఫలాలు..

ఖమ్మం జిల్లాలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులర్పించారు. యంగ్ ఇండియా స్కూళ్లు: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు గణనీయంగా పెరిగాయని, రూ.200 కోట్ల నిధులతో ‘యంగ్ ఇండియా స్కూళ్లను’ నిర్మిస్తున్నామని తెలిపారు.

ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలను అందిస్తున్నామని, క్యాథ్‌లాబ్‌లలో ఉచిత వైద్య పరీక్షలు చేస్తున్నామని పేర్కొన్నారు. జిల్లా ఆసుపత్రులను ఆధునిక వైద్య కేంద్రాలుగా మారుస్తున్నట్లు స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా పరిషత్ కార్యాలయంలో కలెక్టర్ దివాకర టీఎస్ జాతీయ జెండాను ఆవిష్కరించి విగ్రహాలకు పూలమాలలు వేశారు.

అసెంబ్లీ, మండలి మరియు ఇతర వేదికలలో..

తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలిలో ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో కౌన్సిల్ సెక్రటరీ డాక్టర్ వి.నరసింహా చార్యులు, అసెంబ్లీ సెక్రటరీ రేండ్ల తిరుపతి మరియు పలువురు సభ్యులు పాల్గొన్నారు. యాదగిరిగుట్టలో నిర్వహించిన వేడుకల్లో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు.

బీజేపీ కార్యాలయంలో స్వాతంత్య్ర వేడుకలు..

పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు రామచందర్ రావు జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు లక్ష్మణ్, ఈటల రాజేందర్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు.

తెలంగాణ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి (సీజే) అపరేశ్ కుమార్ సింగ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

You may also like
ఈ భవనం పేదలకు నమ్మకం కలిగించాలి: సీఎం రేవంత్!
డ్రగ్స్‌ నియంత్రణలో తెలంగాణకు జాతీయ గుర్తింపు!
కేసీఆర్ కు సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలి: కేటీఆర్!
రూ. 8 కోట్లతో భారీ సెంట్రలైజ్డ్ కిచెన్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions