Sunday 20th September 2026
12:07:03 PM
Home > తాజా > టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. ప్రయాణికులకు ‘ఫస్ట్ అండ్ లాస్ట్-మైల్’ సేవలు!

టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. ప్రయాణికులకు ‘ఫస్ట్ అండ్ లాస్ట్-మైల్’ సేవలు!

TGSRTC Electric Auto Services ప్రజా రవాణాను ప్రజలకు మరింత చేరువ చేయడం, ప్రయాణికులకు సుఖవంతమైన అనుభూతిని అందించడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) మరో కీలక ముందడుగు వేస్తోంది.

టీజీఎస్ఆర్టీసీ కార్యకలాపాలతో అనుసంధానించబడిన ఎలక్ట్రిక్ ఆటో-రిక్షా సేవలను ప్రవేశపెట్టే దిశగా రవాణా శాఖ తీవ్రంగా పరిశీలిస్తోంది.

రాజధాని ప్రాంతంలో బస్ స్టాప్‌లకు చేరుకోవడం మరియు దిగిన తర్వాత ఇంటికి వెళ్లడం వంటి ‘ఫస్ట్-మైల్, లాస్ట్-మైల్ కనెక్టివిటీ’ ఎదుర్కొంటున్న ప్రయాణికులకు ఈ నిర్ణయం పెద్ద ఊరటనివ్వనుంది.

ఒకే టికెట్‌తో బస్సు మరియు ఆటో ప్రయాణం..

ఈ నూతన ప్రణాళిక ప్రకారం, ఆర్టీసీ బస్సు నెట్‌వర్క్‌తో ఎలక్ట్రిక్ ఆటోలను డిజిటల్‌గా అనుసంధానిస్తారు. ప్రయాణికులు తమ బస్సు టికెట్‌తో పాటు అనుసంధాన ఆటో ప్రయాణాన్ని కూడా ఒకే టికెటింగ్ విధానం (Integrated Ticketing) ద్వారా బుక్ చేసుకునే సౌకర్యం కలగనుంది.

ప్రయాణానికి ముందు లేదా దిగిన తర్వాత వేర్వేరు రవాణా వాహనాల కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా నేరుగా నివాస ప్రాంతాల నుండి సమీప బస్ స్టాప్‌లకు, మరియు బస్ స్టాప్‌ల నుండి తుది గమ్యస్థానాలకు ఈ ఇ-ఆటోలు చేరవేస్తాయి.

మొదటి దశలో జీహెచ్ఎంసీ పరిధిలోనే అమలు..

ఈ ప్రాజెక్టును అధికారులు దశలవారీగా పట్టాలెక్కించనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలోని ప్రధాన బస్ స్టాప్‌లు, కనెక్టివిటీ రూట్లలో ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌లో వచ్చే స్పందన, అనుభవాన్ని బట్టి కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ వంటి ఇతర ప్రధాన పట్టణాలకు ఈ సేవలను విస్తరిస్తారు.

ఈవీ కంపెనీలతో సంప్రదింపులు..

ఈ రవాణా నమూనాను అమలు చేయడానికి తగిన ఎలక్ట్రిక్ వాహనాలను ఎంపిక చేయడంతో పాటు, పూర్తి కార్యాచరణ చట్రాన్ని ఖరారు చేసేందుకు ప్రధాన ఈవీ (EV) తయారీదారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. టీజీఎస్ఆర్టీసీ ప్రస్తుత సిస్టమ్‌తో డిజిటల్, లాజిస్టికల్ అనుసంధానంపై ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది.

You may also like
కేసీఆర్ కు సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలి: కేటీఆర్!
గణేశ్ చతుర్థి వేళ చిరంజీవి కీలక పిలుపు!
BJP Kishan REddy
జీవో 97ను బేషరతుగా రద్దు చేయాలి: కిషన్ రెడ్డి!
cm revanth reddy
సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం నో!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions