Wednesday 9th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > నీట్ పేపర్ లీక్‌పై కేంద్ర మంత్రి కీలక ప్రకటన!

నీట్ పేపర్ లీక్‌పై కేంద్ర మంత్రి కీలక ప్రకటన!

Kiren Rijiju About NEET Paper Leak | నీట్ (NEET) పేపర్ లీకేజీ అంశంపై పార్లమెంట్‌లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజూ స్పష్టం చేశారు.

అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లతో సంప్రదింపులు జరుపుతామన్నారు. ఆ తర్వాత చర్చ జరిగే సమయాన్ని వెల్లడిస్తామని చెప్పారు.

అయితే, ఈ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా పార్లమెంట్‌లో ప్రకటన చేయాలని సమాజ్‌వాదీ పార్టీ (SP) అధినేత అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు.

“ఇది రాజకీయ అంశం కాదు.. యువత భవిష్యత్తు”:

ఈ సందర్భంగా లోక్‌సభలో అఖిలేష్ యాదవ్ మాట్లాడారు. నీట్ పేపర్ లీకేజీ అనేది కేవలం రాజకీయ పార్టీల అంశం కాదన్నారు. ఇది కోట్లాది మంది యువత భవిష్యత్తుకు సంబంధించిన విషయమని పేర్కొన్నారు.

సభలో మాట్లాడేందుకు అన్ని పార్టీల సభ్యులకు అవకాశం ఇవ్వాలని కోరారు. నీట్ లీకేజీపై బయట మాట్లాడిన ప్రధాని మోదీ, సభ లోపల ఎందుకు స్టేట్‌మెంట్ ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు.

విద్యాశాఖ మంత్రి రాజీనామాకు కాంగ్రెస్ డిమాండ్:

కాంగ్రెస్ సీనియర్ ఎంపీ కేసీ వేణుగోపాల్ కూడా ఈ అంశాన్ని లోక్‌సభలో తీవ్రంగా లేవనెత్తారు. పరీక్షల నిర్వహణలో వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై తక్షణమే చర్చ చేపట్టాలని విపక్ష సభ్యులు సభలో నినాదాలు చేస్తూ హంగామా చేశారు.

మధ్యాహ్నం 2 గంటలకు సభ వాయిదా:

విపక్షాల నిరసనల మధ్య స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. నీట్ అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి రిజిజూ ఇప్పటికే చెప్పారని సభకు గుర్తుచేశారు. అయినప్పటికీ గందరగోళం కొనసాగడంతో స్పీకర్ లోక్‌సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు.

You may also like
నాతో కలిసి సాయం చెయ్ సోదరా.. విమర్శలకు సూద్ స్వీట్ రిప్లై!
అర్ధరాత్రి మహిళను రైలు నుంచి దించేసిన రైల్వే.. రూ. 2 లక్షల ఫైన్!
వెడ్ ఇన్ ఇండియా.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు!
‘విజయ్ ఫర్ పీఎం’ నినాదంపై చెలరేగిన రాజకీయ వివాదం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions