Wednesday 1st July 2026
12:07:03 PM
Home > తాజా > ప్రభాస్‌కు ఫోన్ చేసిన కేటీఆర్.. ఎందుకంటే!

ప్రభాస్‌కు ఫోన్ చేసిన కేటీఆర్.. ఎందుకంటే!

‌- నెట్టింట వైరల్‌గా మారిన కొత్త ప్రోమో!

BRS Working President KTR Calls Prabhas | భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (KTR) పిల్లల కోరిక మేరకు పాన్ ఇండియా స్టార్, నటుడు ప్రభాస్‌కు స్వయంగా ఫోన్ చేశారు.

‘ది అండర్ 18 వరల్డ్’ (The Under 18 World) గ్రూప్‌కు చెందిన చిన్నారులతో కేటీఆర్ ప్రత్యేకంగా నిర్వహించిన ఒక సరదా చిట్‌చాట్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలై, సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

షో మధ్యలో ప్రభాస్‌ ను లైన్లోకి తెచ్చిన కేటీఆర్

ఈ చిట్‌చాట్ కార్యక్రమంలో భాగంగా చిన్న పిల్లలందరూ కేటీఆర్‌ను చుట్టుముట్టి పలు ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగారు. వీటన్నింటికీ ఆయన ఎంతో ఓపికగా, నవ్వుతూ సమాధానాలు ఇచ్చారు.

ఈ వినూత్న సంభాషణల మధ్యలో.. పిల్లలు తమకు నటుడు ప్రభాస్ అంటే ఇష్టమని, ఆయనతో మాట్లాడాలని కోరారు. వారి కోరికను మన్నిస్తూ కేటీఆర్ వెంటనే అక్కడికక్కడే ప్రభాస్‌కు ఫోన్ చేసి, పిల్లలతో మాట్లాడించారు.

భార్య ఫోన్ చేస్తే.. “షోలో ఉన్నా” అంటూ సరదా సంభాషణ..

ఈ కార్యక్రమంలో ప్రభాస్‌కు ఫోన్ చేయడమే కాకుండా మరికొన్ని ఆసక్తికరమైన, ఆహ్లాదకరమైన సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. కేటీఆర్ పిల్లలతో ముచ్చటిస్తున్న సమయంలోనే ఆయన సతీమణి శైలిమ నుండి ఆయన మొబైల్‌కు ఫోన్ వచ్చింది.

దాంతో కేటీఆర్ ఫోన్ ఎత్తి.. “నేను ప్రస్తుతం ఒక షోలో ఉన్నాను, మళ్ళీ కాల్ చేస్తా” అంటూ చాలా సరదాగా బదులిచ్చి ఫోన్ పెట్టేశారు.ఈ సీన్ ప్రోమోలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

కేటీఆర్ పుష్-అప్స్..

కేవలం మాటలకే పరిమితం కాకుండా, పిల్లల ఉత్సాహాన్ని చూసి కేటీఆర్ వారిలో ఒకరిగా మారిపోయారు. చిన్నారులతో పోటీ పడుతూ వేదికపైనే పుష్-అప్స్ (Push-ups) తీసి, తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకుంటూ అందరినీ ఆశ్చర్యపరిచారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions