Monday 15th June 2026
12:07:03 PM
Home > క్రీడలు > ఫ్యాక్ట్ చెక్: భారత్-పాక్ మహిళా క్రికెటర్లు మైదానంలో గొడవ పడ్డారా?

ఫ్యాక్ట్ చెక్: భారత్-పాక్ మహిళా క్రికెటర్లు మైదానంలో గొడవ పడ్డారా?

  • వైరల్ వీడియో వెనుక అసలు నిజం!

IND vs PAK Womens Cricket Fight Video | ఉమెన్స్ టీ-20 వరల్డ్ కప్‌లో భాగంగా ఆదివారం ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ భారత్‌ను ఘన విజయంతో మురిపించింది. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో టీమిండియా 64 పరుగుల తేడాతో పాక్‌పై ఘన విజయం సాధించింది.

 అయితే, ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత సోషల్ మీడియా వేదికగా ఒక వివాదాస్పద వీడియో విపరీతంగా వైరల్ అవుతూ క్రికెట్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.

వైరల్ వీడియోలో ఏముంది..?

మ్యాచ్ ముగిసిన వెంటనే మైదానంలోనే భారత్ మరియు పాకిస్థాన్ మహిళా ప్లేయర్లు ఒకరితో ఒకరు తీవ్రంగా గొడవకు దిగినట్లు, పరస్పరం నెట్టుకుంటూ చేయి చేసుకున్నట్లు ఆ వీడియోలో కనిపించింది.

ఈ వీడియో అసలు నిజమేంటో తెలుసుకోలేకపోయిన కొందరు నెటిజన్లు, దీనిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇరు దేశాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టడం ప్రారంభించారు.

అసలు నిజం ఇదీ..

వైరల్ అవుతున్న సదరు వీడియో పూర్తిగా ఫేక్ (Fake Video) అని ప్రాథమిక పరిశీలనలో తేలింది. కొందరు ఆకతాయిలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను మరియు డీప్‌ఫేక్ టూల్స్‌ను ఉపయోగించి ఈ తప్పుడు వీడియోను సృష్టించారు. మైదానంలో క్రీడాకారిణులు ఎలాంటి గొడవకు దిగలేదు.  

ఇదిలా ఉండగా, భద్రతా కారణాలు మరియు సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో గతంలో మాదిరిగానే ఈసారి కూడా భారత మహిళా ప్లేయర్లు పాకిస్థాన్ ఆటగాళ్లతో మ్యాచ్ ముగిసిన తర్వాత ‘నో షేక్ హ్యాండ్’ (No Shake Hand) విధానాన్ని కొనసాగించారు.

కేవలం సాంప్రదాయబద్ధంగా నమస్కరిస్తూ మైదానాన్ని వీడారు తప్ప ఎలాంటి ఘర్షణకు తావులేదని స్పష్టమైంది.

You may also like
ప్రపంచ యోగాసనా ఛాంపియన్‌షిప్‌లో భారత్ సంచలనం!
allegations on messi by keralam sport minister
మెస్సీపై కేరళం మంత్రి సంచలన ఆరోపణలు!
virat
ఆర్సీబీలో ఐదుగురు విదేశీ ఆటగాళ్లా..! మిస్టర్ నాగ్ సెటైరికల్ ఇంటర్వ్యూ వైరల్!
United In Triumph
అంధ మహిళల క్రికెట్ జట్టుకు రిలయన్స్ భారీ నజరానా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions