Monday 1st June 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ఏపీ నేతలపై కవిత సంచలన వ్యాఖ్యలు!

ఏపీ నేతలపై కవిత సంచలన వ్యాఖ్యలు!

  • విగ్రహాలు పగలకొట్టి పార్సల్ పంపుతాం..
  • పవన్, లోకేశ్‌పై ఫైర్!

TRS President Kavitha Shocking Comments On Andhra Leaders | తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నేతల మధ్య రాజకీయ విమర్శలు ఒక్కసారిగా పీక్స్‌ కి చేరాయి.

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌లపై టీఆరెస్ (తెలంగాణ రక్షణ సేన) అధ్యక్షురాలు కవిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి రాగానే ఆంధ్రా నాయకుల విగ్రహాలను పగలకొట్టి, వాటిని ఆంధ్రాకే పార్సల్ పంపుతామంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.

హైదరాబాద్‌లోని తెలంగాణ రక్షణ సేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ‘తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు – సాధన రౌండ్ టేబుల్ సమావేశం’ లో కవిత ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

తెలంగాణ అస్తిత్వంపై దాడి: తెలంగాణ అస్తిత్వంపై దాడి చేస్తూ, ఇక్కడ ఆంధ్రా సంస్కృతిని రుద్దాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని కవిత హెచ్చరించారు. ఏపీలో సొంతంగా రాజధాని కట్టుకోవడం చేతకాకనే అక్కడి నేతలు డైవర్షన్ పాలిటిక్స్ (మళ్లింపు రాజకీయాలు) చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు.

 తెలంగాణలో ప్రస్తుతం ఆంధ్రా రాజకీయ నాయకుల ఏజెంట్ సీఎంగా ఉండటం వల్లే ఇదంతా జరుగుతోందని, అందుకే ఇక్కడ ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఈ సందర్భంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి, మంత్రి లోకేశ్ వ్యవహార శైలిని కవిత తీవ్రంగా తప్పుబట్టారు. ఏపీ సెక్రటేరియేట్‌లోకి వర్షపు నీరు రాకుండా చూసుకోవడం చేతకాని పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత తెలంగాణలో నవ నిర్మాణ సభల గురించి మాట్లాడుకుంటే మంచిదని హితవు పలికారు.

 తెలంగాణలో తెలుగుదేశం పార్టీని మళ్లీ విస్తరించడానికి ఇదేమీ మీ సామ్రాజ్యం కాదు లోకేశ్ బాబు అంటూ కవిత ఫైర్ అయ్యారు.

గతంలో ఆంధ్రా పార్టీలకు ఇక్కడి ప్రజలు ఓట్లు వేయకపోవడంతోనే దుకాణం బంద్ చేసుకున్నారనే విషయాన్ని అప్పుడే మర్చిపోయారా? అంటూ ఆమె ఘాటుగా ప్రశ్నించారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions