ప్రెస్ కాన్ఫరెన్స్ వెనుక అసలు నిజాలు లీక్!
Indian Army fake press conference clarification | భారత సైన్యం (Indian Army) ప్రతిష్టను మసకబార్చేలా సోషల్ మీడియాలో, కొన్ని ప్రధాన మీడియా ప్లాట్‌ఫారమ్ లలో సర్క్యులేట్ అవుతున్న ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ వీడియోపై ఆర్మీ తీవ్రస్థాయిలో స్పందించింది.
బలగాల ఇమేజ్‌ను దెబ్బతీయడానికి, సైన్యంలో విభేదాలు సృష్టించడానికి కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా “నకిలీ, హానికరమైన మరియు తప్పుదోవ పట్టించే కథనాలను” ప్రచారం చేస్తున్నారని ఆర్మీ అధికారిక ప్రకటనలో ధ్వజమెత్తింది.
రాజకీయ వేదికలపై సైన్యంలో సేవా నిబంధనల గురించి అబద్ధాలు చెప్తున్న ఆ నలుగురు వ్యక్తుల బ్యాక్‌గ్రౌండ్‌ను బయటపెడుతూ ఆర్మీ సంచలన వివరాలను లీక్ చేసింది.
ప్రతిపక్షాల ప్రెస్ మీట్.. వివాదానికి కారణం ఇదే..
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ సంజయ్ సింగ్, రాష్ట్రీయ జనతా దళ్ (RJD) ఎంపీ మనోజ్ ఝా సంయుక్తంగా నిర్వహించిన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో నలుగురు మాజీ సైనికులు పాల్గొన్నారు. వారు సైన్యంలోని పరిస్థితులపై తీవ్ర ఆరోపణలు చేశారు.
అయితే, ఈ వీడియో వైరల్ కావడంతో రంగంలోకి దిగిన ఆర్మీ.. సదరు వ్యక్తులు అసలు సైనికులే కారని, క్రమశిక్షణా రాహిత్యంతో బహిష్కరణకు గురైన వారని స్పష్టం చేసింది.
ఆ నలుగురి బ్యాక్‌గ్రౌండ్ బయటపెట్టిన ఇండియన్ ఆర్మీ..
ఆర్మీ అధికారిక ప్రకటన ప్రకారం, ప్రెస్ కాన్ఫరెన్స్ లో కనిపించిన వ్యక్తుల అసలు వివరాలు ఇలా ఉన్నాయి. చందు చవాన్, హరేంద్ర యాదవ్, పి. నరేందర్. ఈ ముగ్గురు వ్యక్తులను తీవ్రమైన క్రమశిక్షణా రాహిత్యం (Indiscipline) మరియు సైనికుడికి తగని ప్రవర్తన (Unsoldierly Conduct) కారణంగా గతంలోనే ఆర్మీ సర్వీస్ నుండి పూర్తిగా డిస్మిస్ (Dismissed) చేసింది.
శంకర్ సింగ్ గుజ్జర్..ఈ నాల్గవ వ్యక్తి నవంబర్ 2024 నుండి విధులకు హాజరుకాకుండా పారిపోయిన ‘డెసెర్టర్’ (Deserter). ప్రస్తుతం ఇతనిపై మిలిటరీ కోర్టులతో పాటు సివిల్ కోర్టులలో కూడా తీవ్రమైన డిసిప్లినరీ చర్యలు కొనసాగుతున్నాయి.
ఆర్మీ ఆరోపణ..
“ఈ నలుగురు వ్యక్తులు తాము చేసిన తప్పులు, విధులకు గైర్హాజరు కావడం, మద్యం మత్తులో ప్రవర్తించడం మరియు పైఅధికారుల ఆదేశాలను ధిక్కరించడం (Insubordination) వంటి కేసుల నుండి ప్రజల దృష్టిని మరల్చడానికే సోషల్ మీడియాను వాడుకుంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.”
“ఆఫీసర్ – జవాన్ల విభేదాలు” సృష్టించే కుట్ర!
ఈ నకిలీ కథనాల వెనుక ఒక పెద్ద కుట్ర దాగి ఉందని సైన్యం ఆందోళన వ్యక్తం చేసింది. సైన్యంలో అత్యంత పవిత్రంగా భావించే అంతర్గత క్రమశిక్షణను దెబ్బతీసేందుకు.. ‘ఆఫీసర్-మెన్ డివైడ్’ (అధికారులు మరియు జవాన్ల మధ్య విభజన) తీసుకురావడానికి ఈ నలుగురు ఉద్దేశపూర్వకంగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడింది.
ప్రజలకు ఆర్మీ విజ్ఞప్తి..
ఇలాంటి ప్రపోగాండా (Propaganda) మరియు దేశ రక్షణ వ్యవస్థలకు వ్యతిరేకంగా జరిగే తప్పుడు ప్రచారాలను సోషల్ మీడియాలో నమ్మవద్దని, నకిలీ సమాచారం పట్ల పౌరులందరూ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని భారత సైన్యం పిలుపునిచ్చింది.







