Paparazzis Say Sorry To Salman Khan | బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) కు, ముంబై మీడియా ఫొటోగ్రాఫర్స్ (Paparazzi) కు మధ్య బుధవారం రాత్రి ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది.
తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఒక స్నేహితుడి భార్యను పరామర్శించడానికి హిందూజా హాస్పిటల్‌కు వెళ్లిన సమయంలో.. అక్కడ ఫొటోల కోసం కేకలు వేస్తూ హంగామా చేసిన పాపరాజీలపై సల్మాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే.. పాపరాజీలు సల్మాన్ ఖాన్‌కు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు.
నటుడు రితేష్ దేశ్‌ముఖ్ నటించిన పీరియడ్ యాక్షన్ డ్రామా ‘రాజా శివాజీ’ (Raja Shivaji) సక్సెస్ మీట్ ముంబైలో ఘనంగా జరిగింది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ ఒక కీలక కేమియో పాత్రలో మెరిశారు. ఈ ఈవెంట్‌కు సల్మాన్ రాగానే.. అక్కడున్న ఫొటోగ్రాఫర్స్ అందరూ ఏకధాటిగా “సారీ భాయ్.. భాయ్ సారీ” అంటూ గట్టిగా అరవడం ప్రారంభించారు.
“మీ వాయిస్ నాకు అస్సలు వినపడటం లేదు.. ఇంకా గట్టిగా సారీ చెప్పండి” అంటూ సైగలు చేశారు. సల్మాన్ చేసిన ఈ అల్లరి చూసి పక్కనే ఉన్న రితేష్ దేశ్‌ముఖ్ నవ్వు ఆపుకోలేక.. ఆయన్ని ఆత్మీయంగా హగ్ చేసుకున్నారు.
“మీ వాయిస్ వినపడట్లేదు”.. మొదట్లో అంతా గందరగోళంగా ఉండటంతో పాపరాజీలు ఎందుకు అరుస్తున్నారో సల్మాన్‌కు అర్థం కాలేదు. కానీ, వాళ్లు క్షమాపణలు చెప్తున్నారని గ్రహించిన వెంటనే.. తన సెక్యూరిటీ టీమ్‌ను పక్కకు తప్పుకోమని చెప్పి, రితేష్ దేశ్ముఖ్తో కలిసి హ్యాపీగా ఫోటోలకు పోజులిచ్చారు.
ఆ సమయంలో కూడా పాపరాజీలు సారీలు చెప్తుండటంతో.. సల్మాన్ నవ్వుతూ వాళ్లను ఆటపట్టించారు. “మీ వాయిస్ నాకు అస్సలు వినపడటం లేదు.. ఇంకా గట్టిగా సారీ చెప్పండి” అంటూ సైగలు చేశారు. సల్మాన్ చేసిన ఈ అల్లరి చూసి పక్కనే ఉన్న రితేష్ దేశ్‌ముఖ్ నవ్వు ఆపుకోలేక.. ఆయన్ని ఆత్మీయంగా హగ్ చేసుకున్నారు.
కార్ ఎక్కే ముందు మళ్లీ సీరియస్.. ఈవెంట్ ముగిసి సల్మాన్ ఖాన్ తన కార్ లో తిరిగి వెళ్తున్న సమయంలో మరోసారి వాతావరణం సీరియస్ గా మారింది. కొంతమంది ఫొటోగ్రాఫర్స్ సల్మాన్‌కు పర్సనల్‌గా సారీ చెప్పడానికి కార్ వైపు దూసుకొచ్చారు.
సెక్యూరిటీ వాళ్లను ఆపబోగా.. సల్మాన్ వారించి, వాళ్లు చెప్పేది విన్నారు. లైన్ క్రాస్ చేయొద్దు: ఆ సమయంలో సల్మాన్ చాలా గంభీరంగా మాట్లాడుతూ.. తాను మంగళవారం రాత్రి హాస్పిటల్‌కు వెళ్లింది ఫొటోలకు పోజులు ఇవ్వడానికి కాదని, చావుబతుకుల్లో ఉన్న ఒక స్నేహితుడి భార్యను చూడటానికి వెళ్లానని గుర్తుచేశారు. అలాంటి చోట కూడా కెమెరాలతో అంతలా కేకలు వేయడం కరెక్ట్ కాదని క్లాస్ పీకారు.







