– ఇండియాలో ‘X’ ఖాతా సస్పెండ్!
Cockroach Janata Party X Account Suspended | గత కొన్ని రోజులుగా ఇన్స్టాగ్రామ్ రీల్స్, మీమ్స్ ప్రపంచాన్ని వణికించి, రికార్డు స్థాయి ఫాలోయింగ్‌తో దూసుకుపోతున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (Cockroach Janata Party – CJP)కి ఊహించని షాక్ తగిలింది.
ఈ వ్యంగ్య పొలిటికల్ ఆర్మీకి సంబంధించిన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా భారతదేశంలో సస్పెన్షన్‌కు గురైంది. నిబంధనల ఉల్లంఘన లేదా లీగల్ డిమాండ్ల కారణంగానే ఈ అకౌంట్‌ను హోల్డ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డిజిటల్ ప్రపంచంలో ఈ సస్పెన్షన్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అసలు ఏమిటీ ‘కాక్రోచ్ జనతా పార్టీ’?
ఈ విచిత్రమైన డిజిటల్ ప్రొటెస్ట్ వెనుక ఒక పెద్ద పొలిటికల్ అండ్ జుడీషియల్ బ్యాక్‌డ్రాప్ ఉంది. దేశంలోని కొంతమంది నిరుద్యోగ యువత సోషల్ మీడియా యాక్టివిజం పేరిట ‘బొద్దింకల్లా (Cockroaches), పరాన్నజీవుల్లా (Parasites)’ వ్యవహరిస్తున్నారంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ చేసినట్లు చెప్తున్న కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా ఈ సరికొత్త ట్రెండ్ పుట్టుకొచ్చింది.
అభిజిత్ ఐడియా – డిజిటల్ ఆర్మీ..
సీజేఐ వ్యాఖ్యలకు వ్యంగ్యంగా సమాధానం చెప్పేందుకు ‘అభిజిత్’ అనే యువకుడు సోషల్ మీడియా వేదికగా ఈ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP)ని ప్రారంభించారు. నిరుద్యోగ యువత, మీమర్స్ అంతా కలిసి దీన్ని ఒక డిజిటల్ మూవ్‌మెంట్‌లా మార్చేశారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో రికార్డుల వేట..
సిజేఐ వ్యాఖ్యలపై వ్యంగ్యంగా మొదలైన ఈ కాక్రోచ్ జనతా పార్టీకి సోషల్ మీడియా యూజర్లు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా యూత్ ఈ ప్రొటెస్ట్ ఐడియాకు విపరీతంగా కనెక్ట్ అయ్యారు. ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే ఈ సిజెపి (CJP) ఖాతాకు ఏకంగా 13 మిలియన్లకు (1.3 కోట్లు) పైగా ఫాలోవర్లు వచ్చి చేరారు.
ప్రధాన పార్టీల కంటే ఎక్కువే..
భారతదేశంలోని అతిపెద్ద అధికారిక రాజకీయ పార్టీలైన బీజేపీ (BJP), కాంగ్రెస్ (INC) ల అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజీల ఫాలోవర్ల సంఖ్య కంటే కూడా ఈ వ్యంగ్య ‘బొద్దింకల పార్టీ’ ఖాతాకు కేవలం ఐదు రోజుల్లోనే అంతకంటే ఎక్కువ ఫాలోయింగ్ రావడం దేశవ్యాప్తంగా డిజిటల్ మార్కెటర్లను సైతం ఆశ్చర్యపరిచింది.
అయితే, ఒకవైపు ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ రేంజ్ రికార్డులు క్రియేట్ అవుతున్న తరుణంలోనే.. మరో ప్రముఖ ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (X) లో ఈ పార్టీ ఖాతా సస్పెన్షన్‌కు గురికావడం హాట్ టాపిక్‌గా మారింది. దీని వెనుక లీగల్ ప్రెజర్ ఉందా లేదా అనేది ఇంకా స్పష్టం కావాల్సి ఉంది.







