- గోపీచంద్ మలినేని అఫీషియల్ అనౌన్స్‌మెంట్!
Manchu Manoj In NBK111 | టాలీవుడ్ మాస్ బాక్సాఫీస్ గాడ్ ఫాదర్, నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటిస్తున్న సరికొత్త చిత్రంలో ఒక సెన్సేషనల్ కాస్టింగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది.
బాలకృష్ణ – సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘NBK 111’ (వర్కింగ్ టైటిల్) లో వర్సటైల్ యాక్టర్ మంచు మనోజ్ నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ పుట్టినరోజు (మే 20) సందర్భంగా దర్శకుడు గోపీచంద్ మలినేని సోషల్ మీడియా వేదికగా ఈ మెగా అప్‌డేట్‌ను పంచుకుంటూ మనోజ్‌కు బర్త్ డే విషెస్ తెలిపారు.
హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో క్రూరమైన విలనిజం..?
మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఒక పవర్‌ఫుల్ హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్ (చారిత్రాత్మక నేపథ్యంలో) రూపొందుతున్నట్లు ఫిలిం నగర్ టాక్.
ఈ సినిమాలో మంచు మనోజ్ ఊహించని విధంగా అత్యంత శక్తివంతమైన నెగటివ్ షేడ్స్ ఉన్న (విలన్) పాత్రలో కనిపించబోతున్నారని గట్టిగా వినబడుతోంది.
మనోజ్ యాక్టింగ్ విశ్వరూపం..
మనోజ్‌లోని అసలు సిసలైన నటనను, రౌద్ర రసాన్ని బయటకు తీసేలా గోపీచంద్ మలినేని ఈ విలన్ క్యారెక్టర్‌ను అద్భుతంగా డిజైన్ చేసినట్లు సమాచారం. బాలయ్య సింహగర్జనకు దీటుగా మనోజ్ విలనిజం ఉండబోతోందని టాక్.
14 ఏళ్ల తర్వాత రిపీట్ అవుతున్న మ్యాజికల్ కాంబో!
బాలకృష్ణ, మంచు మనోజ్ కలిసి వెండితెరపై కనిపించడం ఇది మొదటిసారి కాదు. గతంలో 2012లో వచ్చిన ‘ఊ కొడతారా ఉలిక్కిపడుతారా’ చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించి మెప్పించారు. ఆ సినిమాలో బాలయ్య ‘నరసింహ రాయుడు’గా గెస్ట్ రోల్ చేయగా, మనోజ్ హీరోగా చేశారు.
కట్ చేస్తే.. ఇప్పుడు దాదాపు 14 సంవత్సరాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతోంది. అయితే ఈసారి రివర్స్ లో.. బాలయ్య హీరోగా చేస్తుంటే, మనోజ్ ఆయనకు విలన్‌గా రౌద్రం చూపించబోతుండటం గమనార్హం.
ఈ క్రేజీ కాస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చిన క్షణం నుండే నందమూరి అభిమానులతో పాటు సినీ లవర్స్ లో అంచనాలు స్కై హైకి చేరాయి. బాలయ్య మార్క్ డైలాగ్స్, మనోజ్ మార్క్ స్క్రీన్ ప్రెజెన్స్ థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది.







