‘TN07 CM 2026’ నంబర్ ప్లేట్ వెనుక అసలు కథ ఇదీ!
Venkat Prabhu Gifts to CM Vijay | రీల్ లైఫ్ సీన్.. రియల్ లైఫ్‌లో నిజమైతే ఆ కిక్కే వేరు. తమిళనాడు నూతన ముఖ్యమంత్రి, టీవీకే (TVK) అధినేత దళపతి విజయ్ విషయంలో సరిగ్గా ఇదే జరిగింది.
తొలి ప్రయత్నంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్‌ను.. ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఆయన సీఎం విజయ్‌కు అందించిన ఒక అరుదైన బహుమతి ఇప్పుడు సోషల్ మీడియాలో పీక్స్ లో ట్రెండ్ అవుతోంది.
‘ది గోట్’ (The GOAT) మూవీ సీన్ రిపీట్: 2024లో విజయ్ – వెంకట్ ప్రభు కాంబినేషన్‌లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (The GOAT) గుర్తుంది కదా? అందులో ఒక కీలక సన్నివేశంలో విజయ్ నడిపే కారు నంబర్ ప్లేట్‌పై ‘TN07 CM 2026’ అని రాసి ఉంటుంది.
అప్పట్లో సినిమా రిలీజ్ టైమ్‌లో మెగాస్టార్ విజయ్ రాజకీయ ఎంట్రీని ఉద్దేశించి దర్శకుడు పెట్టిన ఈ నంబర్ ప్లేట్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించింది. నాడు సినిమాలో.. నేడు నిజ జీవితంలో! దర్శకుడు వెంకట్ ప్రభు అప్పట్లో ఊహించినట్టే.. సరిగ్గా 2026 ఎన్నికల్లో విజయ్ గెలిచి తమిళనాడు ముఖ్యమంత్రి (CM) అయ్యారు.
దాంతో ఆ పాత సినిమా సీన్ అక్షరాలా నిజమైంది. ఈ నేపథ్యంలోనే సీఎం విజయ్‌ను కలిసిన వెంకట్ ప్రభు.. నాడు సినిమాలో వాడిన ఆ ఐకానిక్ ‘TN07 CM 2026’ నంబర్ ప్లేట్‌ను ఒక అందమైన ఫోటో ఫ్రేమ్‌గా మార్చి విజయ్‌కు బహుమతిగా ప్రజెంట్ చేశారు.
ఈ అరుదైన గిఫ్ట్ చూసి సీఎం విజయ్ ముఖంలో పెద్ద నవ్వు విరిసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియా వేదికలపై “దళపతి విజయ్ విజనరీ.. వెంకట్ ప్రభు ప్రెడిక్షన్” అంటూ ఫ్యాన్స్ విపరీతంగా షేర్ చేస్తున్నారు.







