Friday 8th May 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > జైలులో చిగురించిన ప్రేమ.. మాజీ ఖైదీని పెళ్లాడిన లేడీ ఆఫీసర్!

జైలులో చిగురించిన ప్రేమ.. మాజీ ఖైదీని పెళ్లాడిన లేడీ ఆఫీసర్!

satna jail love story

Satna Jail Love Story | మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో సినిమా సన్నివేశం లాంటి ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. జైలులో ఖైదీకి, జైలు అధికారికి మధ్య ప్రేమ చిగురించింది. అది పెళ్లి వరకు వెళ్లింది.

హత్య కేసులో జీవిత ఖైదు అనుభవించి విడుదలైన ఒక మాజీ ఖైదీని, అదే జైలులో అసిస్టెంట్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఫిరోజా ఖాతూన్ వివాహం చేసుకున్నారు.

సత్నా సెంట్రల్ జైలులో వారెంట్ ఇన్‌చార్జ్‌గా పనిచేస్తున్న ఫిరోజా ఖాతూన్‌కు, 2007 హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ధర్మేంద్ర సింగ్‌తో పరిచయం ఏర్పడింది. జైలులో వారెంట్ సంబంధిత పనుల్లో ధర్మేంద్ర అధికారులకు సహాయం చేసేవాడు.

ఈ క్రమంలో వారిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం స్నేహంగా, ఆపై ప్రేమగా మారింది. ధర్మేంద్ర సింగ్ మంచి ప్రవర్తన కారణంగా సుమారు 14 ఏళ్ల శిక్ష తర్వాత నాలుగేళ్ల క్రితం విడుదలయ్యాడు. బయటకు వచ్చిన తర్వాత కూడా వీరి బంధం కొనసాగింది.

ఈ నెల (మే) 5వ తేదీన వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. సామాజిక విమర్శలకు తావు లేకుండా ధర్మేంద్ర తన వివాహ ఆహ్వాన పత్రికలో పేరు కూడా మార్చుకున్నట్లు తెలుస్తోంది.

ఈ మతాంతర వివాహానికి విశ్వహిందూ పరిషత్ (VHP) జిల్లా ఉపాధ్యక్షుడు రాజ్‌బహదూర్ మిశ్రా, ఆయన భార్య కలిసి ఫిరోజాకు ‘కన్యాదానం’ నిర్వహించారు.

భజరంగ్ దళ్ సభ్యులు కూడా ఈ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వివాహం ఇప్పుడు ఆ ప్రాంతంలో హాట్ టాపిక్‌గా మారింది. జైలు అధికారులు, సిబ్బంది కూడా ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions