Saturday 25th April 2026
12:07:03 PM
Home > తాజా > టీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ‘షాహీ’ విందు.. అతిథులకు 34 రకాల వంటకాలు!

టీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ‘షాహీ’ విందు.. అతిథులకు 34 రకాల వంటకాలు!

trs party

K Kavitha TRS party launch feast 34 dishes | రాజకీయాల్లో ‘వ్యూహం’ ఎంత ముఖ్యమో, వచ్చిన కార్యకర్తలను ‘తృప్తి పరచడం’ కూడా అంతే ముఖ్యం. శనివారం మునీరాబాద్‌లో జరిగిన ‘తెలంగాణ రాష్ట్ర సేన’ (TRS) ఆవిర్భావ సభ దీనికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచింది.

పార్టీ పేరు, జెండా ఆవిష్కరణ ఒక ఎత్తైతే.. సభకు వచ్చిన వేలాది మంది కార్యకర్తల కోసం ఏర్పాటు చేసిన 34 రకాల వంటకాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

పార్టీ ప్రకటనకు ముందు కవిత గన్ పార్కులో అమరవీరులకు నివాళులర్పించి, తన జూబ్లీహిల్స్ నివాసంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.

సభా ప్రాంగణంలో తెలంగాణ తల్లితో పాటు అంబేద్కర్, పూలే, జయశంకర్ ఆచార్యుల విగ్రహాలను ఏర్పాటు చేసి తన పార్టీ సిద్ధాంతాన్ని చాటారు.

తెలంగాణ నలుమూలల నుండి వచ్చిన జాగృతి నేతలు, కార్యకర్తల కోసం నిర్వాహకులు ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. ఇందులో తెలంగాణ ఆథెంటిక్ రుచులతో పాటు మొత్తం 34 రకాల పదార్థాలను వడ్డించారు.

సామాన్య కార్యకర్త నుండి ముఖ్య నేతల వరకు అందరికీ ఒకే రకమైన భోజనాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం.

మొదటి సభలోనే ఇంత భారీ స్థాయిలో జన సమీకరణ చేయడం, పక్కా ప్రణాళికతో విందు ఏర్పాటు చేయడం ద్వారా.. రాబోయే రోజుల్లో తాము ఎంత పటిష్టంగా ఉండబోతున్నామో కవిత స్పష్టం చేశారు.

You may also like
kavitha five promises
‘పాంచజన్యం’.. కవిత ప్రకటించిన ఐదు హామీలు ఇవే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions