Monday 27th July 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > దళపతి విజయ్‌కు ‘పెటా’ షాక్.. పావురం ఎగురవేసినందుకు!

దళపతి విజయ్‌కు ‘పెటా’ షాక్.. పావురం ఎగురవేసినందుకు!

Thalapathy Vijay TVK pigeon controversy ఁ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) అధినేత విజయ్‌కు జంతు సంరక్షణ సంస్థ పెటా (PETA) నుండి నోటీసులు అందాయి.

తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఆయన ఒక పావురాన్ని ఎగురవేయడం ఇప్పుడు వివాదాస్పదమైంది.

అసలేం జరిగింది..
తిరుచ్చి ఈస్ట్ నుండి పోటీ చేస్తున్న టీవీకే అభ్యర్థి తరపున విజయ్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థి విజయ్ చేతికి ఒక తెల్లటి పావురాన్ని అందించారు.

విజయ్ ఆ పావురాన్ని గాలిలోకి ఎగురవేశారు. అయితే, ఆ పావురం రెక్కలకు టీవీకే పార్టీ జెండా రంగులను పూశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జంతు ప్రేమికులు మండిపడుతున్నారు.

పెటా అభ్యంతరాలు ఇవే..
పావురం రెక్కలకు రంగులు పూయడం వల్ల వాటి చర్మం, రెక్కలు దెబ్బతింటాయని, ఇది జంతు హింస కిందకు వస్తుందని పెటా పేర్కొంది. ఎన్నికల ప్రచారంలో ఎటువంటి మూగజీవాలను, పక్షులను ఉపయోగించకూడదని కేంద్ర ఎన్నికల సంఘం (ECI) 2012లోనే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

విజయ్ ఈ నిబంధనలను ఉల్లంఘించారని పెటా ఆరోపించింది. విజయ్ వద్ద మరిన్ని పక్షులు ఉంటే వాటిని వెంటనే తమకు లేదా పునరావాస కేంద్రాలకు అప్పగించాలని పెటా డిమాండ్ చేస్తూ విజయ్‌కు లేఖ రాసింది.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions