Gas Price Hike | ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ (Iran – Israel War) సంయుక్తంగా దాడిని ప్రారంభించడం ఇందులో ఇరాన్ సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీ (Khameini) మృతి చెందడంతో పశ్చిమాసియా ఒక్కసారిగా భగ్గుమంది.

ప్రతీకార దాడుల్లో భాగంగా ఇజ్రాయెల్ తో సహా గల్ఫ్ దేశాలపై ఇరాన్ మిస్సైళ్ళు, డ్రోన్లతో దాడి చేస్తుంది. అక్కడి యుద్ధ ప్రభావం భారత్ పై కూడా పడింది. దింతో ఒక్కసారిగా వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి.
డొమెస్టిక్ 14.2 కేజీల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పై రూ.60, కమర్షియల్ 19 కేజీల గ్యాస్ సిలిండర్ పై రూ.115 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ ధరలు వెంటనే అమల్లోకి రానున్నాయి. దింతో హైదరాబాద్ లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.965కు చేరింది.
అయితే ఉజ్వల్ పథకం ద్వారా అందించే సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు ఉండదని చమురు సంస్థలు స్పష్టం చేశాయి. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడుతుందని విశ్లేషణలు వస్తున్న విషయం తెల్సిందే. ఈ యుద్ధం మూలంగానే తాజగా రేట్లు పెరిగినట్లు తెలుస్తోంది





