Sunday 19th April 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ఇరాన్ యుద్ధనౌకపై యూఎస్ దాడి..ప్రధానిపై రాహుల్ ఫైర్!

ఇరాన్ యుద్ధనౌకపై యూఎస్ దాడి..ప్రధానిపై రాహుల్ ఫైర్!

Rahul Fires On PM Modi | భారతదేశం ఫిబ్రవరి చివరి వారంలో నిర్వహించిన మిలాన్-2026, ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొని స్వదేశానికి వెళ్తున్న ఇరాన్ యుద్ధ నౌక ఐఆర్ఐఎస్ దేనా (IRIS Dena) పై అమెరికా అత్యంత భయంకర దాడి జరిపిన విషయం తెల్సిందే.

శ్రీలంకకు సమీపంలో హిందూ మహాసముద్రం అంతర్జాతీయ జలాల్లో ఈ దాడి జరిగింది. ఈ నేపథ్యంలో లోకసభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఇరాన్ మరియు అమెరికా-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం భారత సమీపంలోకి వచ్చేసిందని పేర్కొన్నారు.

హిందూ మహాసముద్రంలో మన ఇంటి వెనుక భాగంలో ఇరాన్ యుద్ధ నౌక మ్యూనిహిపోయిందని అయినప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మౌనంగా ఉన్నారని రాహుల్ ధ్వజమెత్తారు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో దేశానికి స్థిరమైన, ధృఢమైన నాయకత్వం కావాలన్నారు.

కానీ దేశంలో రాజీపడిన ప్రధాని ఉన్నారని ఫైర్ అయ్యారు. ప్రధాని మోదీ దేశ వ్యూహాత్మక స్వాతంత్ర్యాన్ని పూర్తిగా వదిలేశారని సంచలన ఆరోపణలు చేశారు. అలాగే దేశం చమురు సరఫరా ప్రమాదంలో పడిందని, దేశ చమురు దిగుమతుల్లో 40 శాతం కంటే ఎక్కువ హార్మూజ్ జలసంధి గుండా వస్తుందన్నారు.

ఇరాన్ యుద్ధంతో ఇప్పుడు ఈ సరఫరా ప్రమాదంలో పడిందని తెలిపారు. ఎల్పీజీ, ఎల్ఎన్జీ సరఫరాల మరింత ప్రమాదంలో పడ్డాయని రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.

You may also like
Rahul Gandhi on Women's Reservation Bill 2026
ఆ సినిమాను ఎవరూ చూడటం లేదు: రాహుల్ గాంధీ!
Mallikarjuna Kharge
యూఎస్ ముందు మోదీ సరెండర్.. మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు!
Iran warship hit by USA
WW-II తర్వాత అతిపెద్ద దాడి.. విశాఖ నుంచి వెళ్తున్న ఇరాన్ నౌకపై..
ఇరాన్ పై దాడులు..ఒక్క రోజే అమెరికాకు రూ.ఎన్నివేల కోట్ల ఖర్చంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions