Saturday 12th September 2026
12:07:03 PM
Home > తాజా > WhatsApp ద్వారా SSC హాల్ టికెట్స్.. డౌన్ లోడ్ చేసుకోండిలా!

WhatsApp ద్వారా SSC హాల్ టికెట్స్.. డౌన్ లోడ్ చేసుకోండిలా!

ssc hall tickes on whatsapp

‌- మొదటి రోజే 30 వేల మంది విద్యార్థుల వినియోగం

హైదరాబాద్: ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టికెట్లను వాట్సాప్ నంబర్ 8096 95 8096 ద్వారా (SSC Hall Tickets On WhatsApp) ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని మీ సేవ కల్పించింది.

ఈ సర్వీసు గురువారం నాడు అందుబాటులోకి రాగా రాష్ట్రవ్యాప్తంగా 30 వేల మంది విద్యార్థులు హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు.

ఎలా డౌన్ లోడ్ చేసుకోవచ్చు…
ముందుగా 8096 95 8096 నంబర్‌ను తమ ఫోన్‌లో MeeSeva Telangana పేరుతో సేవ్ చేసుకోవాలి. తర్వాత వాట్సాప్‌లో ఆ నంబర్‌కు “Hi” అని మెసేజ్ పంపితే చాట్‌బాట్ ప్రారంభమవుతుంది. తరువాత “SSC Hall Ticket” అని టైప్ చేసి మెను నుంచి Open Service ఎంపిక ఎంచుకోవాలి.

ఆ తర్వాత జిల్లా, పాఠశాల పేరు, విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, లాంటి వివరాలను నమోదు చేస్తే హాల్ టికెట్ వెంటనే వాట్సాప్‌లో ప్రత్యక్షమవుతుంది. విద్యార్థులు ఫోన్‌లో సేవ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు.

ప్రజల నుంచి విశేష స్పందన…
మీ సేవ వాట్సాప్ సేవలకు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటివరకు దాదాపు 8 లక్షల ట్రాన్సాక్షన్లు నమోదయ్యాయి.

ఎక్కువగా వినియోగిస్తున్న సేవల్లో… బర్త్ సర్టిఫికేట్, ఆదాయ ధృవీకరణ పత్రం, పోలీస్ చలాన్, విద్యుత్ బిల్లు చెల్లింపులతో పాటు తాజాగా ప్రారంభమైన ఎస్ఎస్సీ హాల్ టికెట్ సేవ ఉన్నాయి.

మీ సేవ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత వేగంగా, సులభంగా చేరవేయాలన్న ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు స్మార్ట్ ఫోన్ ద్వారా పలు సర్వీసులను అందుబాటులోకి తెచ్చినట్టు మీసేవ కమిషనర్ టి. రవికిరణ్ వెల్లడించారు.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
modi civic satyagraha call
బీ అలెర్ట్.. ప్రధాని మోదీ ‘సివిక్ సత్యాగ్రహం’ పిలుపు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions