Sunday 6th September 2026
12:07:03 PM
Home > తాజా > బలవంతంగా రంగులు పూస్తే.. సజ్జనర్ వార్నింగ్

బలవంతంగా రంగులు పూస్తే.. సజ్జనర్ వార్నింగ్

vc sajjanar

Hyd CP Sajjanar Warning | హైదరాబాద్ (Hyderabad) నగరంలో హోలీ పండుగను (Holi Celebrations) ప్రశాంతంగా జరుపుకోవాలని పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ (CP VC Sajjanar)సూచించారు. ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయ‌న హెచ్చరించారు. 

ఈ మేరకు బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీ నుంచి సోమవారం ఆయన పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఇష్టం లేని వారిపై బలవంతంగా రంగులు పూస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.

బహిరంగ ప్రదేశాల్లో, పాదచారులు, వాహనాలపై రంగులు చల్లొద్దని, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే ఆకతాయిల ఆటకట్టించేందుకు నగరవ్యాప్తంగా మఫ్టీలో షీ టీమ్స్ నిఘా ఉంటుందన్నారు. రోడ్లపై యువకులు గుంపులుగా తిరుగుతూ న్యూసెన్స్ చేస్తే వాహనాలను సీజ్ చేస్తామ‌నన్నారు. 

ప్రస్తుతం రంజాన్ మాసం నేప‌థ్యంలో ముస్లింల ప్రార్థనలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాల‌న్నారు. పీస్ కమిటీల సమన్వయంతో పోలీసులు పనిచేయాలని చెప్పారు.

హోలీ సందర్భంగా హైద‌రాబాద్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో మంగ‌ళ‌వారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, కల్లు కాంపౌండ్లు, బార్ అండ్ రెస్టారెంట్లపై ఆంక్ష‌లు విధించిన‌ట్లు తెలిపారు. 

You may also like
జపాన్‌ సాంకేతిక విద్యపై తెలంగాణ దృష్టి!
తస్మాత్ జాగ్రత్త.. సెల్ ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ!
రాజకీయ నైతికతకు ప్రతీక జైపాల్ రెడ్డి: సీఎం రేవంత్
హైడ్రా పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions