Wednesday 2nd September 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > టీటీడీ ఛైర్మన్ వైరల్ వీడియోలు..స్పందించిన బీఆర్ నాయుడు

టీటీడీ ఛైర్మన్ వైరల్ వీడియోలు..స్పందించిన బీఆర్ నాయుడు

BR Naidu Viral Video | తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడుకి సంబంధించినవిగా పేర్కొంటూ పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఓ మహిళతో ఆయన ఉన్నట్లుగా ఉన్న వీడియోలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఈ తరుణంలో వైరల్ గా మారిన వీడియోలపై బీఆర్ నాయుడు స్పందించారు. నకిలీ డీప్ ఫేక్ వీడియోలతో కొందరు సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. వ్యక్తిగతంగా తనను అప్రతిష్ట పాలు చేసేందుకు, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. AI సాంకేతికతను వాడుకుని తన రూపం అనుకరించే విధంగా వీడియోలు తయారు చేసి ప్రచారం చేస్తున్నారని తెలిపారు.

సదరు కంటెంట్ మొత్తం అసత్యమైనదని ఇది టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు పన్నిన పథకం అని వెల్లడించారు. దీని వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని వైసీపీ కి చెందిన కొందరు ఈ తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నారన్నారు. సోషల్ మీడియాలో సాగుతున్న దుష్ప్రచారం వెనుక ఉన్న కుట్ర ను తేల్చాలని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions