Thursday 15th October 2026
12:07:03 PM
Home > తాజా > చెఫ్ కాదు..నంబర్ వన్ గ్యాంగ్‌స్టర్

చెఫ్ కాదు..నంబర్ వన్ గ్యాంగ్‌స్టర్

Nani’s Film With Sujeeth Titled Bloody Romeo | నచురల్ స్టార్ నాని దర్శకుడు సుజీత్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. నాని పుట్టినరోజు సందర్భంగా మంగళవారం ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను విడుదల చేశారు. ‘బ్లడీ రోమియో’ అనే టైటిల్ ను మేకర్స్ ఖరారు చేశారు. ఈ మేరకు ఒక స్పెషల్ వీడియోను విడుదల చేశారు. అందులో నాని చెఫ్ గా కనిపించారు.

చిటికెడు కరుణ, పిడికెడు కోపం, బారెడు బీభత్సం, మతిపోయేంత ప్రేమ అంటూ నాని క్యారెక్టర్ ను పరిచయం చేశారు. చివర్లో అతను నంబర్ వన్ గ్యాంగ్‌స్టర్ అంటూ పేర్కొనడం హైలెట్ గా నిలిచింది. వేసవి కాలం నుంచి సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం నాని శ్రీకాంత్ ఓడెల దర్శకత్వంలో జడల్ మూవీలో నటిస్తున్న విషయం తెల్సిందే.

You may also like
జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ!
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions