Kavitha About Jubilee Hills By Election Result | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. బీఆరెస్ అభ్యర్థిగా అయిన మాగంటి సునీత ఓటమి పాలయ్యారు. ఇదే సమయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎక్స్ వేదికగా సంచలన పోస్ట్ చేశారు.
‘కర్మ హిట్స్ బ్యాక్’ అంటే కర్మ తిరిగి ఇస్తుంది అని కవిత చేసిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. ఆమె ఈ పోస్టు ఎవరిని ఉద్దేశించి చేసినదో అనేది మాత్రం పేర్కొనలేదు. కానీ జూబ్లీహిల్స్ లో బీఆరెస్ ఓడిన సమయంలో కవిత ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తిగా మారాయి. బీఆరెస్ నుండి తనను కుట్ర చేసి బయటకు పంపారని, అలాగే గతంలో నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుండి తాను పోటీ చేసిన సమయంలో కుట్ర చేసి సొంత పార్టీ నాయకులే తనను ఓడించారని కవిత వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే.










