Tuesday 2nd June 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > రాహుల్ ఆరోపణలు..స్పందించిన బ్రెజిలియన్ మోడల్

రాహుల్ ఆరోపణలు..స్పందించిన బ్రెజిలియన్ మోడల్

Brazilian model reacts after Rahul Gandhi’s claim of Haryana electoral fraud | లోకసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు నేపథ్యంలో బ్రెజిలియన్ మోడల్ లారిస్సా స్పందించారు. కాగా రాహుల్ గాంధీ బుధవారం మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు.

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఓట్ల చోరీ జరిగిందన్నారు. మొత్తం రెండు కోట్ల ఓటర్లు ఉన్న హర్యానాలో 25 లక్షల ఫేక్ ఓట్లు ఉన్నాయని, ఈ ఓట్ల తోనే బీజేపీ ఎన్నికల్లో గెలిచిందని కాంగ్రెస్ నుండి అధికారాన్ని లాగేసుకుందని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. హైడ్రోజన్ బాంబు పేరిట నిర్వహించిన మీడియా సమావేశంలో ఓ బ్రెజిలియన్ మోడల్ ఫోటోను రాహుల్ చూపించారు. బ్రెజిలియన్ మోడల్ పేరు తెలీదు, ఆమెకు హర్యానాతో ఎలాంటి సంబంధం లేదన్నారు.

కానీ ఆమె ఫోటో పెట్టి నకిలీ ఓట్లను సృష్టించారని తెలిపారు. మొత్తం పది బూతుల్లో బ్రెజిలియన్ మోడల్ ఫోటో ఉన్న ఓటరు కార్డుతో 22 సార్లు ఓట్లు వేశాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో బ్రెజిలియన్ మోడల్ ఫోటో వైరల్ గా మారింది. ఆమె కోసం నెటిజన్లు వెతికారు. ఇదే సమయంలో స్వయంగా మోడల్ లారిస్సా స్పందించారు. ప్రస్తుతం తాను మోడల్ గా పని చేయడం లేదని బ్రెజిల్ లో ఓ సెలూన్ షాపును నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాహుల్ గాంధీ ఆరోపించిన ఫేక్ ఓట్లలో వాడిన తన ఫోటో సుమారు 20 ఏళ్ల క్రితం ది అని వెల్లడించారు.

తాను భారత్ కు ఎప్పుడూ రాలేదని, దేశ ఎన్నికల గురించి ఎలాంటి అవగాహన లేదన్నారు. ఇండియాలో తాను ఫేమస్ అవ్వబోతున్నట్లు జోక్ చేశారు. ఇదిలా ఉండగా రాహుల్ ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఒకవేళ ఫేక్ ఓట్లే ఉంటే పోలింగ్ బూతుల్లో ఉండే కాంగ్రెస్ ఏజెంట్లు ఎం చేశారని ఎన్నికల సమయంలో వారు ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదని ఎన్నికల సంఘం తెలిపింది. కేంద్రమంత్రి కిరణ్ రిజుజు స్పందిస్తూ రాహుల్ ఎన్నికల ప్రక్రియను అవమానిస్తున్నారని మండిపడ్డారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions