Sunday 22nd February 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > మోదీని హత్య చేసేందుకు యూఎస్ కుట్ర..కాపాడిన పుతిన్?

మోదీని హత్య చేసేందుకు యూఎస్ కుట్ర..కాపాడిన పుతిన్?

Was Modi Under Assassination Threat During SCO Summit? | భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని హత్య చేసేందుకు అమెరికా కుట్ర చేసిందా? యూఎస్ కు చెందిన సీఐఏ ఇందుకు పథక రచన చేసిందా? చైనా పర్యటనలోనే మోదీని హతమార్చాలని అమెరికా అనుకుందా? మోదీ ప్రాణాలను రష్యా అధ్యక్షుడు పుతిన్ కాపాడారా? ఇప్పుడు ఈ ప్రశ్నలు సంచలనంగా మారాయి.

ఈ మేరకు పలు అంతర్జాతీయ మీడియాలో కథనాలు రావడం ప్రకంపనలు సృష్టింస్తుంది. దీనిపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. కానీ జరిగిన కొన్ని పరిణామాలు ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. అసలేం జరిగిందంటే..! షాంఘై సహకార శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఆగస్ట్ 30న చైనా లోని తియాంజిన్ కు వెళ్లారు. ఇదే సమయంలో ఆగస్ట్ 31న బంగ్లాదేశ్ రాజధాని దాకాలో అమెరికా ఏజెంట్ టెరెన్స్ ఆర్వెల్ జాక్సన్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు.

అయితే బంగ్లాదేశ్ సైనికులకు శిక్షణ ఇచ్చేందుకు దాకా చేరుకున్న ఆర్వెల్ జాక్సన్ అనుమానాస్పద రీతిలో మరణించడం సంచలనంగా మారింది. ఇతను సీఐఏ ఆదేశాల ప్రధాని మోదీని అసాసినేట్ చేసే ప్రణాళిక రూపొందించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మోదీ హత్యకు కుట్ర జరుగుతోందని రష్యా ఇంటెలిజెన్స్ అధికారులకు సమాచారం అందింది. వారు వెంటనే భారత రీసర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ రా కు సమాచారం అందించారు. ఈ క్రమంలో రష్యా-భారత ఇంటలీజెన్స్ అధికారులు అత్యంత రహస్యంగా దాకాలో ఉన్న సీఐఏ ఏజెంట్ ను హత్య చేశారని విశ్లేషణలు వస్తున్నాయి.

మరోవైపు షాంఘై సదస్సులో భాగంగా రష్యా అధినేత పుతిన్, ప్రధాని మోదీ మధ్య జరిగిన ఓ చర్చ కూడా ఇప్పుడు ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తుంది. హత్య కుట్రను ముందుగానే గ్రహించిన పుతిన్ షాంఘై సదస్సు సందర్భంగా మోదీని ప్రోటోకాల్ కు విరుద్ధంగా తన అధికారిక ఫోర్టీఫైడ్ వాహనంలో తీసుకెళ్లారు. కారులోనే ఈ ఇరువురు నేతలు 45 నిమిషాల పాటు చర్చించుకున్నారు. సాధారణంగా కారులోనే 45 నిమిషాల పాటు చర్చలు చేయడం అసాధారణం. ఈ క్రమంలోనే హత్య కుట్రను మోదీకి పుతిన్ వివరించారని ప్రచారం జరుగుతుంది. ఈ విధంగా పుతిన్ మోదీ ప్రాణాలను కాపాడారు అట.

మరోవైపు చైనా పర్యటన అనంతరం ప్రధాని మోదీ సెమికాన్ ఇండియా-2025 సమ్మిట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగం ప్రారంభించే ముందు ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. దీనిపై స్పందించిన ప్రధాని మోదీ ‘మీరు క్లాప్స్ కొడుతున్నారు..నేను చైనా పర్యటనకు వెళ్లినందుకా, లేక తిరిగి వచ్చినందుకా’ అని చేసిన వ్యాఖ్యలు అమెరికా హత్య కుట్రను తెలియజేస్తున్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలా మోదీ చైనా పర్యటన, దాకాలో సీఐఏ ఏజెంట్ హత్య, మోదీని పుతిన్ తన అధికారిక వాహనంలో తీసుకెళ్లడం, సుమారు 45 నిమిషాల పాటు కారులోనే మాట్లాడుకోవడం వంటి పరిణామాలు అమెరికా పన్నిన మోదీ హత్య కుట్రను తెలియజేస్తున్నాయని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

You may also like
bravery girl saves toddlers for faulty elevator
లిఫ్ట్ ప్రమాదం నుంచి చిన్నారులను కాపాడిన బాలిక.. వీడియో వైరల్!
మహిళలకు ఉచిత ప్రయాణంలో కీలక మార్పు.. ఇక మరింత సులభం!
carlos turcios comments on hanuman statue
టెక్సాస్ లో 90 అడుగుల హనుమాన్ విగ్రహంపై అమెరికన్ సంచలన వ్యాఖ్యలు!
Fire breaks out at Aditya Enclave
HYD- అమీర్ పేట్ లో అగ్ని ప్రమాదం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions