Friday 11th September 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ‘బాలకృష్ణ తాగి వచ్చాడు..స్పీకర్ కు బుద్ధి లేదు’

‘బాలకృష్ణ తాగి వచ్చాడు..స్పీకర్ కు బుద్ధి లేదు’

Ys Jagan Sensational Comments On Balakrishna | హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ పై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్. కొద్దిరోజుల క్రితం శాసనసభ వేదికగా బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ఆ తర్వాత బాలకృష్ణ స్పందించిన తీరు వివాదస్పదంగా మారాయి. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మెగాస్టార్ చిరంజీవితో సహా ఇతర నటులకు అవమానం జరిగిందని బీజేపీ ఎమ్మెల్యే ఆరోపించారు.

అనంతరం మాట్లాడిన బాలయ్య జగన్, చిరంజీవి పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. తాజగా బాలకృష్ణ వ్యాఖ్యలపై జగన్ స్పందించారు.

గురువారం మీడియాతో మాట్లాడిన జగన్..అసెంబ్లీలో మాట్లాడిన అంశాలు ఏంటి, బాలకృష్ణ మాట్లాడింది ఏంటని నిలదీశారు. బాలకృష్ణ మద్యం సేవించి అసెంబ్లీకి వచ్చారని అసలు తాగిన వ్యక్తిని శాసనసభలోకి ఎలా అనుమతించారని జగన్ ప్రశ్నించారు. బాలకృష్ణ అలా మాట్లాడే విధంగా అనుమతిచ్చిన స్పీకర్ కు బుద్ధి లేదన్నారు. బాలకృష్ణ వ్యాఖ్యలు ద్వారా ఆయన మానసిక స్థితి ఏంటో అర్ధం అవుతుందని జగన్ హాట్ కామెంట్స్ చేశారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions