Sunday 18th October 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ఆపరేషన్ సింధూర్ 2.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు!

ఆపరేషన్ సింధూర్ 2.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు!

rajnath singh

Operation Sindhoor | కశ్మీర్ లోని పహల్ గాంలో ఉగ్రచర్యకు ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్ ద్వారా పాక్ భూభాగంలోని ఉగ్రస్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది.

ఈ నేపథ్యంలో తాజాగా ఆపరేషన్ సింధూర్ పై కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.  ప్రస్తుతం మొరాకో పర్యటనలో ఉన్న ఆయన పాకిస్థాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని, కేవలం తాత్కాలికంగా నిలిపివేశామని తెలిపారు. పాక్ ఉగ్రవాద చర్యలు కొనసాగిస్తే, భారత్ వాటికి తగిన జవాబునిస్తుందని స్పష్టం చేశారు.

“పాకిస్థాన్‌ ఉగ్రవాదులు మతం అడిగి పౌరులను చంపారు. మేము వారిని మతం ఆధారంగా చంపలేదు. వారి చర్యల ఆధారంగా ఆపరేషన్ చేపట్టాం ” అని రాజ్‌నాథ్‌ అన్నారు.

ఆపరేషన్ సింధూర్ ద్వారా పాక్ భూభాగంలో 100 కిలోమీటర్లు లోపల ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసినట్లు రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు. ఉగ్రవాది మసూద్ అజార్ కుటుంబానికి భారీ నష్టం వాటిల్లిందని చెప్పారు. ఆపరేషన్ సిందూర్ 2, 3 అనేవి పాక్ చర్యల ఆధారంగా ఉంటాయని తెలిపారు.

You may also like
జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ!
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions