Sunday 13th September 2026
12:07:03 PM
Home > తాజా > మాజీ మంత్రి కేటీఆర్ బర్త్ డే.. సోషల్ మీడియాలో కవిత పోస్ట్!

మాజీ మంత్రి కేటీఆర్ బర్త్ డే.. సోషల్ మీడియాలో కవిత పోస్ట్!

Kavitha Post On KTR Birthday | మాజీ మంత్రి, బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) జన్మదినం సందర్భంగా గురువారం బీఆర్ఎస్ (BRS Party) శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబరాలు జరుపుతున్నాయి.

పార్టీలోని ముఖ్య నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కేటీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. హైదరాబాద్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆయనకు స్వయంగా బర్త్ డే విషెస్ చెప్పడానికి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

ఇదిలా ఉండగా, బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) కూడా తన సోదరుడైన కేటీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ‘అన్నయ్యా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్ ఆఫ్ ది డే’ అని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

కాగా, కొన్ని రోజుల కిందట బీఆరెస్ అధినేత కేసీఆర్ కు కవిత రాసిన లేఖ లీక్ అయిన నేపథ్యంలో ఈ విషయం పార్టీలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. తదనంతర పరిణామాలతో కేటీఆర్, కవిత మధ్య రాజకీయంగా కొంత గ్యాప్ వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె కేటీఆర్ కు బర్త్ డే విషెష్ చెప్పడం ప్రాధాన్యం సంతరించకుంది.

You may also like
జపాన్‌ సాంకేతిక విద్యపై తెలంగాణ దృష్టి!
తస్మాత్ జాగ్రత్త.. సెల్ ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ!
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
బీఆరెస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions