Tuesday 15th September 2026
12:07:03 PM
Home > క్రీడలు > ENG vs IND నాలుగవ టెస్టు..భారత జట్టు ఇదే!

ENG vs IND నాలుగవ టెస్టు..భారత జట్టు ఇదే!

ENG vs IND Fourth Test | అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా బుధవారం నుంచి మాంచెస్టర్ వేదికగా నాలుగవ టెస్టు మ్యాచ్ మొదలైంది.

టాస్ గెలిచి ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. భారత యువ పేసర్ అన్షుల్ కంబోజ్ ఈ మ్యాచుతో టెస్టు అరంగేట్రం చేశారు. మరోవైపు కరుణ్ నాయర్ కు అవకాశం లభించలేదు.

టీం ఇండియా విషయానికి వస్తే-యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, కెప్టెన్ శుభమన్ గిల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్థుల్ ఠాకూర్, బుమ్రా, సిరాజ్, అన్షుల్ కంబోజ్ లతో బరిలోకి దిగనుంది.

ఇకపోతే ఇంగ్లాండ్ జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, కెప్టెన్ బెన్ స్టోక్స్, వికెట్ కీపర్ జెమీ స్మిత్, లియామ్ డాసన్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్ తో బరిలోకి దిగింది.

ఐదు టెస్టు మ్యాచుల సిరీస్ లో ఇప్పటికే రెండింట్లో ఇంగ్లాండ్ గెలిచి ముందంజలో ఉంది. ఈ మ్యాచ్ టీం ఇండియాకు చావోరేవో వంటిది.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions