Monday 31st August 2026
12:07:03 PM
Home > తాజా > బండి సంజయ్ బర్త్ డే..20వేల సైకిళ్ళ పంపిణీ

బండి సంజయ్ బర్త్ డే..20వేల సైకిళ్ళ పంపిణీ

Bandi Sanjay News Latest | కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన పుట్టినరోజు సందర్భంగా వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు.

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు 20 వేల సైకిళ్ళ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. మోదీ గిఫ్ట్ పేరిట ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని సేవ చేసే అవకాశం ఉన్నంత కాలం, ప్రతి సంవత్సరం సైకిళ్లు ఇస్తానన్నారు. 20 వేల సైకిళ్ళ పంపిణీ పూర్తయిన తర్వాత మోదీ కిట్ లు కూడా పంపిణీ చేస్తానని బండి సంజయ్ హామీ ఇచ్చారు.

కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుండి 6వ తరగతి వరకు చదువుతున్న ప్రతి విద్యార్థికి మోదీ కిట్ లు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కిట్‌లలో స్కూల్ బ్యాగ్‌లు, స్టీల్ వాటర్ బాటిళ్లు, నోట్‌బుక్‌లు మరియు మరెన్నో అవసరమైన వస్తువులు ఉంటాయని పేర్కొన్నారు.

ఒక బాలుడు తరగతి గదిలోకి నమ్మకంగా అడుగు పెట్టడానికి అవసరమైన ప్రతిదీ ఇందులో ఉంటుందన్నారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions